E-Paper
Advertisement

ఒళ్లో అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏం చేశారంటే?

ఒళ్లో అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏం చేశారంటే?
Advertisement

Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా నగరంలోని చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై జరిగిన ఒక ఘటనా దృశ్యం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ దృశ్యాల్లో ఒక యువకుడు ఆటో నడుపుతూ, ఒక అమ్మాయిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రయాణించాడు. బిజీగా ఉండే ప్రధాన రహదారిపై, తోటి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ చేసిన ఈ పని తీవ్ర నిరసనలకు దారితీసింది.

అయితే, నెటిజన్లు ఈ వీడియోను పోలీసులకు ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరడంతో చంచల్‌గూడ, చాదర్‌ఘాట్ పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆటో నంబరును గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణలో ఆ డ్రైవర్ ముస్లిం మైనర్ అని తేలింది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ఆ యువకుడు ఇలా ప్రమాదకర రీతిలో ఆటో నడపడం పట్ల పోలీసులు తీవ్రంగా పరిగణించి, అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు (JJB) ముందు ప్రవేశపెట్టారు.

Advertisement

దీంతో కేసును పరిశీలించిన జువైనల్ బోర్డు, ఆ మైనర్ యువకుడికి సమాజానికి ఉపయోగపడేలా ఒక వినూత్నమైన శిక్షను విధించింది. కేవలం జైలుకు పంపడం లేదా జరిమానా వేయడం వల్ల మార్పు రాదని భావించి, నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి మ్యాధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయంలో సేవలు అందించాలని ఆదేశించింది. క్రమశిక్షణ నేర్పడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసేందుకే ఈ తరహా వినూత్న శిక్ష విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అంతేకాకుండా రహదారులపై ఇటువంటి ప్రమాదకర రీతిలో ప్రవర్తించడం వల్ల సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. యువత రీల్స్, సోషల్ మీడియా క్రేజ్ కోసం తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నగర భద్రతపై ఆందోళన కలిగించడమే కాకుండా, తోటి ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తాయి. తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Also Read: ఇండియా సహా 60 దేశాలపై అమెరికా టారిఫ్స్ బాంబ్.. నేటి నుంచే అమలు.. అసలు కారణం ఇదే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×