E-Paper
Advertisement

Mallanna: తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై అటాక్.. దాడి వారి పనేనా?

Mallanna: తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై అటాక్.. దాడి వారి పనేనా?
Advertisement

Mallanna: తీన్మార్ మల్లన్న. తెలంగాణలో ఈ పేరు తెలీని వారు ఉండరు. గతంలో పలు ఛానెల్స్‌లో పని చేసి.. ఇప్పుడు సొంతంగా Q-న్యూస్ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారు. రోజూ ఆయనకు ఒకటే పని. కేసీఆర్ సర్కారును కుమ్మేయడమే ఆయన డ్యూటీ. ఉదయాన్నే న్యూస్ పేపర్ల అనాలసిస్‌తో షో స్టార్ట్ అవుతుంది. అందులో, యాంటీ కేసీఆర్ ఐటమ్స్‌పై తనదైన స్టైల్‌లో స్పైసీ కామెంట్లు చేస్తూ.. ప్రభుత్వాన్ని కుళ్లబొడుస్తుంటారు. ఆయన మాటలు, వాడే పదాలకు జనాల్లో మంచి పాపులారిటీ ఉంది. వ్యూస్ కూడా బాగా వస్తుంటాయి. జర్నలిస్ట్‌గా ఉంటూనే.. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఎందుకోగానీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

రోజూ కల్వకుంట్ల ఫ్యామిలీని తిడుతూ ఉంటే.. సర్కారు చూస్తు ఊరుకుంటుందా? మల్లన్న నోరు మూయించేందుకు పలుమార్లు క్యూ-న్యూస్ కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులు పెట్టి మల్లన్నను జైల్లో పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతగా బెదిరింపులకు పాల్పడినా.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అదరలేదు, బెదరలేదు.

Advertisement

లేటెస్ట్‌గా హైదరాబాద్‌లోని Q-న్యూస్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం కావడంతో ఆఫీసులో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కొందరు దుండగులు గుంపుగా కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. పని ముగించుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులో లేరు.

దాడి అనంతరం సిబ్బంది, మల్లన్న అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయాన్ని పరిశీలించారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

క్యూ న్యూస్‌లో రెగ్యులర్‌గా అనేక మందిపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు చింతపండు నవీన్. అందులో మెజార్టీ విమర్శలు బీఆర్ఎస్ నేతలపైనే ఉంటాయి. వారిలో ఎవరికో కోపం వచ్చినట్టుంది. ఇలా ఆఫీసుపై పడి దాడి చేశారని అంటున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×