E-Paper
Advertisement

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అస్సాం సీఎం హిమంత భేటీ.. ఆ అంశాలపై చర్చ!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అస్సాం సీఎం హిమంత భేటీ.. ఆ అంశాలపై చర్చ!
Advertisement

Kishan Reddy: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అస్సాం రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు, గనుల రంగం అభివృద్ధి, ఇతర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు, కొత్త గనుల ఎక్స్‌ప్లోరేషన్, వనరుల సద్వినియోగం, గనుల రంగంలో పెట్టుబడులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

అస్సాంలో బొగ్గు, గనుల రంగానికి సంబంధించిన పలు అంశాలు, ఎదురవుతున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీసుకురాగా, వాటిపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Also Read: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల సహకారంతో బొగ్గు, గనుల రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Also Read: బంజారాహిల్స్‌లో భారీ చోరీ.. వాష్ రూమ్ కిటికీ పగలగొట్టి.. కిలో బంగారం ఎలా కొట్టేసారంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×