E-Paper
Advertisement

Asaduddin Owaisi: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్.. మోదీకి ఒవైసీ సూటి ప్రశ్న, వారి మాటేంటి?

Asaduddin Owaisi: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్.. మోదీకి ఒవైసీ సూటి ప్రశ్న, వారి మాటేంటి?
Advertisement

Asaduddin Owaisi: ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయెల్ పర్యటనపై పలు ప్రశ్నలు సంధించారు AIMIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. మోదీ పర్యటనను అకాల టూర్ గా ఆయన పేర్కొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో భారత్ తటస్థంగా వ్యవహరించడంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విషయంలో భారత్ విదేశాంగ విధానాన్ని తప్పుబట్టారు.

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్

Advertisement

టెహ్రాన్‌పై దాడి చేయడానికి కొన్నిగంటల ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వెళ్లడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా భారత్ నిలుస్తుందనే తప్పుడు సందేశాన్ని పంపిందన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇరాన్ మీద యుద్ధం చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీకి తెలుసా? తెలియదా? అంటూ ప్రశ్నించారు ఒవైసీ. ఈ యుద్ధం గురించి ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ చెప్పిందా? లేదా? లేవనెత్తారు. మిడిల్ ఈస్ట్‌లో దుబాయ్ వంటి ప్రాంతాల్లో దాదాపు 10 కోట్ల మంది భారతీయులు ఉన్నారని, వారందరినీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుంది? ప్రశ్న లేవనెత్తారు.

Advertisement

ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించిన ఎంఐఎం చీఫ్ ఒవైసీ

ప్రధాని పర్యటన ముగియగానే ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేస్తే అక్కడి సాధారణ పౌరులకు ఎలాంటి సందేశాన్ని పంపుతుందని అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ ఈ ప్రశ్నలకు సమాధానం తప్పకుండా చెప్పాలన్నారు. మోడీ పర్యటనను దాడి చేయడానికి ఇజ్రాయెల్ ఉపయోగించుకుందని, భారత్ తమతో ఉందని ప్రపంచానికి తెలియజేయడానికి చేసి ఉండవచ్చని ఆరోపించారు.

ఇజ్రాయెల్ లో 10 నుంచి 18 వేల మంది భారతీయులు ఉన్నారని ఆయన చెప్పారు. అలాగే ఇరాన్ లో 50 వేలు భారతీయులు ఉన్నట్లు తెలిపారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను ప్రస్తావించిన ఓవైసీ, మోడీ టూర్‌ని ఇజ్రాయెల్ రాజకీయంగా ఉపయోగించుకుందన్నారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఆమోదం పొందడానికి మోడీని పావుగా ఉపయోగించుకుందన్నారు ఓవైసీ.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×