// // Army Helicopter Crash : జవాన్ మృతితో సిరిసిల్లలో విషాదం.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Army Helicopter Crash : జవాన్ మృతితో సిరిసిల్లలో విషాదం.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..

Army Helicopter Crash : జవాన్ మృతితో సిరిసిల్లలో విషాదం.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..
Advertisement

Army Helicopter Crash : జమ్ముకాశ్మీర్‌ లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో సిరిసిల్ల జిల్లాకు చెందిన టెక్నిషియన్ పబ్బల్ల అనిల్ మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు గాయపడ్డారు. సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపంతో కిశ్త్ వాడ్ జిల్లా అటవీప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ప్రమాదంలో తెలంగాణకు చెందిన సిరిసిల్ల వాసి అనిల్ మృతి చెందాడు. మరువా నదితీరాన హెలికాప్టర్ శకలాలు గుర్తించారు.

ఆర్మీ జవాన్ అనిల్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. బోయినపల్లి మండలం‌ మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ ఆర్మీలో పదేళ్లుగా టెక్నిషియన్ గా‌ విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం అనిల్ సెలవులు ముగించుకొని‌ తిరిగి విధుల్లోకి‌ చేరారు. ప్రమాద ఘటనపై అర్మీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ధ్రువ్ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురికావడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి.

Advertisement

‌అనిల్‌ మృతితో మల్కాపూర్ లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పబ్బాల మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు అనిల్‌ కు బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అయాన్‌, ఆరవ్‌ ఉన్నారు. నెల రోజుల క్రితం అనిల్‌ స్వగ్రామానికి వచ్చారు. కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. కోరెంలో జరిగిన బీరప్ప ఉత్సవాలకు హాజరయ్యారు. 10 రోజుల క్రితమే తిరిగి విధులకు వెళ్లారు. ఇంతలోనే హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి అనిల్ మృతదేహం స్వగ్రామానికి తరలించే అవకాశం ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×