E-Paper
Advertisement

KCR : కేసీఆర్ పలుకే బంగారమాయేనా?

KCR : కేసీఆర్ పలుకే బంగారమాయేనా?
Advertisement

మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం కేవలం గులాబీ అభిమానులు, కేడర్ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. తమ అభిమాన నేత బయటకు వస్తే రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.గతంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత బయటకు వచ్చిన ఆయన మరల రాలేదు.ఆ తర్వాత ఒక్కసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యాక ఫౌంహస్‌కే పరిమితం అయ్యారు. ఫాంహౌస్‌లో విచారణకు సిట్ నో చెప్పడంతో నాడు నందినగర్‌లోని ఆయన నివాసంలోనే విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సైతం బయటకు రాలేదు. ఫలితాలపై కేసీఆర్ మాట్లాడుతారని అంతా భావించినా కనీసం ప్రెస్‌నోట్ కూడా విడుదల చేయలేదు.

కేసులు, విచారణలు..

గత పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పెద్దఎత్తున ఆరోపించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉండటంతో ఎన్నికల సమయంలో ప్రకటించినట్టుగానే విచారణల పర్వం కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసు, కాళేశ్వరం, అక్రమ మైనింగ్, కబ్జాలు, భూ బదలాయింపులపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావులపై విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ సహా వీరిద్దరూ ఇప్పటికే పలుమార్లు సిట్, ఇతర దర్యాప్తు సంస్థల విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

టైం కోసం చూస్తున్నారా?

Advertisement

బీఆర్ఎస్ పార్టీ ఓడాక వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఓటమి పాలైంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలు, సర్పంచ్, మున్సిపల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. పది మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ ఫిరాయించారు. ప్రస్తుతం వీరంతా బీఆర్ఎస్‌లోనే తాము ఉన్నామని అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా పేర్కొన్నారు. కానీ, అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనూ కేసీఆర్ ఏం మాట్లాడలేదు. కేవలం కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే లీగల్ ఫైట్ చేశారు.వీరికి సలహాలు ఇవ్వడానికి మాత్రమే కేసీఆర్ ఆసక్తి చూపించారు. సిట్ విచారణ సమయంలోనూ కేసీఆర్ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు.

మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు, భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని

Advertisement

బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కొనసాగుతున్న విచారణలు, పార్టీ ఫిరాయింపులు, ఆరు గ్యారంటీల ఫెయిల్, ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల మరణాలు, పింఛన్ పెంచకపోవడం, మహిళలకు రూ.2500, తులం బంగారం వంటి అంశాలపై కేసీఆర్ ప్రశ్నించాలని గులాబీ కేడర్ ఆశిస్తోంది. కానీ, ఆయన ఫాంహౌస్ వీడి బKRయటకు రావడం లేదు. కనీసం అక్కడి నుంచైనా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ప్రజలు సైతం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చూడాలనుకుంటున్నట్టు నెట్టింట్ చర్చ జరుగుతున్నది.ఆయన పలుకే బంగారమైందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి రెండున్నరేండ్లు గడిచిన సందర్బంగా కేసీఆర్… ఫౌంహౌస్ నుంచి బయటకు రావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గులాబీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే ఆయన వాయిస్ బలంగా వినిపించాలని కేడర్, అభిమానులు కోరుతున్నారు.కేవలం పండుగలు, సీనియర్ నేతలు అకాల మరణం, రాష్ట్రానికి చెందిని వారికి అవార్డులు వచ్చిన తరుణంలో స్పందిస్తే ఉపయోగం ఏమి ఉండదని అంటున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×