E-Paper
Advertisement

APSRTC Driver Nagaraju: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

APSRTC Driver Nagaraju: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..
Advertisement

APSRTC Driver Nagaraju: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి ఏసీ బస్సును నడుపుతుండగా, ఒక్కసారిగా అస్వస్థతకు గురైన డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను రక్షించారు. గుండెల్లో నొప్పి వస్తున్నా సంయమనం కోల్పోకుండా, బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కకు ఆపిన కొద్దిసేపటికే ఆయన సీటులోనే కుప్పకూలిపోయారు.

విజయవాడ డిపోకు చెందిన నాగరాజు (గొల్లపూడి నివాసి) ఈ బస్సును నడుపుతున్నారు. చౌటుప్పల్ సమీపంలోకి రాగానే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వేగంగా ఉన్నప్పటికీ, తన ప్రాణం పోతున్నా ప్రయాణికుల భద్రతనే లక్ష్యంగా పెట్టుకుని బస్సును సురక్షితంగా పక్కకు నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

Advertisement

ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రాణాలను కాపాడి డ్రైవర్ నాగరాజు తనువు చాలించడం పట్ల వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నాగరాజు మృతితో విజయవాడ డిపోలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also:  చూస్తుండగానే కాలి బూడిదైన మహీంద్రా ఈవీ, కంపెనీ ఏం చెప్పిందంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×