E-Paper
Advertisement

National Herald Case : మళ్లీ తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్

National Herald Case : మళ్లీ తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్
Advertisement

National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు.యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

యంగ్ ఇండియన్‌ ఫౌండేషన్‌ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మెుత్తం ఎక్కడిదనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50ఏ ప్రకారం అంజన్ కుమార్ యాదవ్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. అక్టోబర్ 3న అంజన్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు.

Advertisement

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ,రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. జూన్‌లో వరుసగా మూడు రోజులపాటు ఢిల్లీలో జరిగిన విచారణకు సోనియాగాంధీ హాజరయ్యారు.అప్పట్లో 70కి పైగా ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారు. ఈడీ ప్రశ్నలకు సోనియాగాంధీ సరైన సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఈ కేసు విచారణను ఈడీ చేపట్టింది.

    Related News

    జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

    ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

    ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

    యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

    బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

    ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

    సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

    మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

    Big Stories

    Advertisement
    ×