// // Andole Sarpanch: నేరడిగుంట సర్పంచ్‌ పై మహిళ దాడి కలకలం -->
E-Paper
Advertisement

Andole Sarpanch: నేరడిగుంట సర్పంచ్‌ పై మహిళ దాడి కలకలం

Andole Sarpanch: నేరడిగుంట సర్పంచ్‌ పై మహిళ దాడి కలకలం
Advertisement

Andole Sarpanch: స్వేచ్చ బ్యూరో: అందోల్‌ మండలం నేరడిగుంట గ్రామ సర్పంచ్‌ ఒగ్గు సాయి కిరణ్‌పై జోగిపేట తహసీల్దారు కార్యాలయం ఆవరణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు చూస్తుండగానే అదే గ్రామానికి చెందిన మహిళ కాలర్‌పట్టుకొని బూతులు తిడుతూ దాడి చేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ సంఘటన బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం జరిగింది. నేరడిగుంట గ్రామానికి చెందిన సుశీల అనే మహిళకు చెందిన భూమిని సర్పంచ్‌ కుటుంబీకులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారన్న ఆరోపణపై మహిళ ఒకేసారి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది. సర్పంచ్‌ కాలర్‌ పట్టుకున్నదాన్ని సర్పంచ్‌ అనుచరుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా ఆ మహిళ అతడి కాలర్‌పట్టుకొని భూతులు తిడుతూ కొద్ది దూరం ఈడ్డుకొచ్చి పిడిగుద్దులు గుద్దడం కనిపించింది.

చెక్కుల పంపిణీ కార్యక్రమం..

అడ్డు వచ్చిన ఆమె భర్త శ్రీశైలంను కూడా కాలితో తన్ని ప్రక్కకు తోసేసింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల తన భూమిని పట్టాచేకున్నారంటూ అదే గ్రామానికి చెందిన ఓ మహిళ సర్పంచ్‌ను నిలదీసింది. బుధవారం జోగిపేట తహసీల్దారు కార్యాలయ ఆవరణలో చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా లబ్దిదారులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నేరడిగుంట సర్పంచ్‌ ఒగ్గు సాయికిరణ్‌ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో సాయికిరణ్‌కు వరుసకు చిన్నమ్మ అయిన సుశీల అనే మహిళ తన భూమిని తిరిగి ఎప్పుడు పట్టా చేయిస్తావంటూ భూతులు తిడుతూ సాయికిరణ్‌ మీదకు దూసుకువెళ్లి కాలర్‌ పట్టుకొని లాగింది.

Advertisement

Also Read: కీలక ఘట్టం ఆవిష్కృతం.. ఫ్యూచర్‌ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

వీడియో చిత్రీకరిస్తూ..

ఇంతలో అక్కడే ఉన్న సర్పంచ్‌ అనుచరుడు మహిళను వీడియో చిత్రీకరిస్తుండగా సుశీల గమనించి అతడి కాలర్‌పట్టుకొని పిడిగుద్దులు గుద్తుకుంటూ సర్పంచ్‌ వద్దకు లాక్కొచ్చింది. ఈ గొడవను ఆపడానికి వచ్చిన సుశీల తన భర్తను అని చూడకుండా కాలుతో తన్నారు. ఈ సంఘటనను వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, నాయకుల ప్రజలు చూసుకుంటూ ఉండిపోయారు తప్ప అడ్డుకోవడానికి సాహసించలేకపోయారు.

మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసాః సర్పంచ్‌

Advertisement

తనపై దౌర్జన్యానికి పాల్పడి చంపుతానని బెదిరించిన సుశీల ఆమె భర్త శ్రీశైలంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్‌ ఒగ్గు సాయికిరణ్‌ తెలిపారు. గ్రామంలో జరిగిన కుటుంబ తగాదాలను ఉద్దేశపూర్వకంగా అందరి ముందు తనపై దాడికి ప్రయత్నించిందని, నా అనుచరుడిని కాలర్‌పట్టుకొని అందరి ముందు లాక్కొని వచ్చిందని ఆయన తెలిపారు. భాద్యత గల సర్పంచ్‌ అని చూడకుండా బూతులు తిట్టిన మహిళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.

Also read: ఆ ఫ్యూచ‌ర్ లేనోళ్ల ర‌ద్దు మాట‌లు ప‌ట్టించుకోవ‌ద్దు..! ర‌ద్ద‌యిన వెయ్యి నోటు ఆ పార్టీ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×