// // Ananthagiri Eco Tourism: అనంతగిరిలో మరో కొత్త కార్యక్రమం -->
E-Paper
Advertisement

Ananthagiri Eco Tourism: పర్యాటకులకు ఇక పండగే.. అనంతగిరిలో ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించిన సర్కార్..!

Ananthagiri Eco Tourism: పర్యాటకులకు ఇక పండగే.. అనంతగిరిలో ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించిన సర్కార్..!
Advertisement

Ananthagiri Eco Tourism: స్వేఛ్చ బ్యూరో: పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా నూతన అనుభూతిని పంచేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్‌కు దగ్గరలో అనంతగిరి ఉంది. ఈ ప్రాంతం అంతా కొండలు, అడవులతో నిండి ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతం తెలంగాణ ఊటిగా పేరొందింది. ఈ ప్రాంతంలో ‘దీబ్రీజ్’ పేరుతో సరికొత్త ఎకో-టూరిజం ప్రాజెక్టును టీజీఎఫ్డీసీ ప్రారంభించింది. పచ్చని చెట్లు, పక్షులరాగాలమధ్య టూరిస్టులు బ్రేక్‌ఫాస్ట్ చేసేలా అవకాశాన్ని కల్పించింది. ప్రకృతి ఒడిలో సేదతీరడంతోపాటు గడ్డి మైదానాల్లో ఆరుబయట ప్రత్యేకంగా టేబుల్స్​పై అల్పాహారాన్ని అందించనుంది. అందుకు కావల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రిసార్ట్ ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు మంచి వీకెండ్ స్పాట్‌గా మారుతోంది. కెన్యా, టాంజానియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో కనిపించే ఇలాంటి సఫారీ అనంతగిరి కొండల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

టూరిస్టులకు నూతన అనుభూతి..

అనంతగిరి కొండల్లో ఏర్పాటు చేసిన బుష్ బ్రేక్‌ఫాస్ట్ కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవి మధ్యలో, పచ్చని గడ్డి మైదానాల్లో ఆరుబయట ప్రత్యేకంగా టేబుల్స్ పై ప్రశాంత వాతావరణంలో అల్పాహారం చేసేలా ఏర్పాట్లు చేశారు. సఫారీ లేదా ట్రెక్కింగ్ తర్వాత చెట్లమధ్య అహ్లాదకరమైన వాతావరణంలో బ్రేక్ ఫస్ట్ చేయడం టూరిస్టులకు నూతన అనుభూతిని అందించనుంది. ఈ తరహాలో ఆఫ్రికాలోని మసాయి మారా అభయారణ్యంలో విశాలమైన గడ్డి భూములు ఉండటం పర్యాటకులకు ఆకర్షిస్తుంది. అదే వాతావరణం అనంతగిరిలో ఉండటంతోఈ ప్రాంతాన్ని సైతం తెలంగాణ మసాయి మారాగా పిలుస్తున్నారు. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని విధంగా (ఎకో ఫ్రెండ్లీ) లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. ఉదయం లేవగానే గైడెడ్ నేచర్ వాక్స్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, ఎర్లీ మార్నింగ్ జీప్ సఫారీలు, సూర్యోదయ-సూర్యాస్తమయాల వీక్షణ వంటివి ఇక్కడ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలుస్తున్నాయి. ప్రతి క్షణం ప్రకృతితో మమేకమయ్యేలా ఇక్కడ రూపకల్పన చేశారు.

Advertisement

Also Read: Brahmamudi Serial Today February 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ట్రస్ట్ పెట్టాలని ఆలోచిస్తున్న రాజ్, కావ్య  

మంచి వీకెండ్ స్పాట్..

పర్యాటకులకు సేవలందించేందుకు స్థానికయువతకే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. హాస్పిటాలిటీ, వంట మనుషులు, ట్రెక్కింగ్ గైడ్స్, మెయింటెనెన్స్ బాధ్యతలు అప్పగించారు. వారు పర్యాటకులతో అటవీలోఎలా నడుచుకోవాలి.. భద్రతా ప్రమాణాలు ఇలా పలు అంశాలపై వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ రిసార్ట్​కు మధ్యాహ్నం 1 గంటలకు వెళ్తే మళ్లీ మరుసటిరోజు ఉదయం 10 గంటలకు చెక్​ అవుట్​చేయాల్సి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులకు ఇది మంచి వీకెండ్ స్పాట్, ఒక్కసారి వస్తే మళ్లీ ఇక్కడికి రావాలనిపించేలా దీనిని తీర్చిదిద్దామని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్యాకేజీ లు సైతం ప్రకటించారు. “deccanwoodsandtrails.com” వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.ట్రెక్కింగ్, బర్డ్ వాక్, చేస్తూ సూర్యుడు అస్తమించే వ్యూ పాయింట్ వద్దకు తీసుకెళ్తారు.మానేచురలిస్ట్ లు చెట్లు, పక్షులు, గడ్డి, జంతువులు ట్రెక్కింగ్ మధ్యలో వివరిస్తూ తీసుకెళ్తారు. సఫరీ లో గ్రాస్ ల్యాండ్స్, ఫారెస్ట్ 10 కిలోమీటర్లు కవర్ అవుతుంది. ఒక పాయింట్ లో దిగి ట్రెక్కింగ్ ,బర్డ్ వాక్ చేస్తారు. అడవిలోని పారె జలపాతలలో ట్రెక్ కొనసాగుతుంది.

ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వలేదు

Advertisement

అనంతగిరిలో ఈ ప్రాజెక్టును అటవీ అభివృద్ధి సంస్థ ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వలేదని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎకో టూరిజం ఎల్.రంజిత్ నాయక్ తెలిపారు. ఈ ప్రాజెక్టును సంస్థ తన సొంత బ్రాండ్ అయిన డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ ఆధ్వర్యంలో స్వయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.లాభాపేక్ష కంటే పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తూనే, అడవికి ఎలాంటి హాని కలగకుండా అధికారులే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని, దీనిని ప్లాస్టిక్ రహిత జోన్‌గా తీర్చిదిద్దారు. పర్యాటకులకు భద్రతతోపాటు అడవిలో సఫారీ, బర్డ్ వాచింగ్ వంటి ప్రత్యేక అనుభూతులను ఈ ప్రాజెక్టు అందిస్తోంది.

Also Read: BRS Party: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ.. మున్సిపల్‌ ఎన్నికల్లో చేతులెత్తేసిన గులాబీ నాయకులు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×