E-Paper
Advertisement

Amit Shah : వర్గ విభేదాల వల్లే నష్టపోయాం.. తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా వార్నింగ్..

Amit Shah : వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆ పార్టీ నేతలకు ఆదేశించారు. హైదరాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయన్నారు. 30 సీట్లు వస్తాయని ఆశించాం కానీ అనుకున్నన్ని సీట్లు సాధించలేక పోయామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలన్నారు. సిట్టింగ్‌ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామని అని అమిత్‌ షా తెలిపారు.

Advertisement

అనంతరం ” దేశంలోమోడీ విజయం చారిత్రక అవసరం” అనే రాజకీయ తీర్మాణం డీకే అరుణ ప్రవేశ పెట్టగా.. రాష్ట్ర నేతలు ఆమోదించారు. అంతకు ముందు శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షా కు బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ లు శాలువా సత్కరించి స్వాగతం పలికారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×