E-Paper
Advertisement

Amit Shah Speech : POKను పాక్ కు అప్పగిద్దామా ? వికారాబాద్ సభలో అమిత్ షా

Amit Shah Speech : POKను పాక్ కు అప్పగిద్దామా ? వికారాబాద్ సభలో అమిత్ షా
Advertisement

Amit Shah Fires on Revanth comments(TS politics): పదేళ్ల ఎన్డీఏ పాలనలో ఉగ్రవాదాన్ని అంతం చేశామని, ప్రధాని మోదీపై ఇంతవరకూ ఒక్క అవినీతి మరక కూడా లేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. శనివారం వికారాబాద్ లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరయ్యారు. జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటేయాలని హితవు పలికారు. ఒకరు ఉగ్రవాదాన్ని అంతం చేస్తే.. మరొకరు ఉగ్రవాదానికి రక్షణ ఇచ్చేవారని మోదీ, రాహుల్ లో ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. బీజేపీకి ఓటేస్తే.. తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తామన్నారు.

మోదీ దీపావళి రోజు కూడా సెలవు లేకుండా పనిచేశారని, కాస్త వేడి పెరిగితే రాహుల్ టూర్ కు వెళ్లిపోయారని యద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తో తీవ్రవాదాన్ని మట్టుపెట్టామని బీజేపీ చెబుతుంటే.. రేవంత్ రెడ్డి దానిపై వెటకారంగా మాట్లాడటం తగదన్నారు. కాంగ్రెస్ కు సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం లేదని, ఇలాంటివి బీజేపీతో మాత్రమే సాధ్యమని తెలిపారు. ABC అంటే.. A- అసదుద్దీన్, B-బీఆర్ఎస్, C – కాంగ్రెస్ అని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మళ్లీ పాతపాటే అందుకున్నారు అమిత్ షా. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

Also Read : కేసీఆర్ ధన దాహానికి పాలమూరు బలైంది: సీఎం రేవంత్

పాకిస్థాన్ వద్ద ఆటమ్ బాంబ్ ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ చెబుతున్నారని, దానికి భయపడి పీఓకేను పాకిస్థాన్ ను అప్పగించలేమన్నారు. బీజేపీ ఉన్నంత వరకూ పీఓకేను పాకిస్థాన్ కు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. కశ్మీర్ మనదో కాదో తెలంగాణ ప్రజలే చెప్పాలని అడిగారు. బీజేపీకి ఓటు వేసి.. మళ్లీ మోదీనే ప్రధానిని చేయాలని, మోదీతోనే దేశ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×