E-Paper
Advertisement

Amberpet SI: బంగారం కొట్టేసీ.. రివాల్వర్ అమ్మేసి.. అడ్డంగా దొరికిపోయిన ఎస్సై

Amberpet SI: బంగారం కొట్టేసీ.. రివాల్వర్ అమ్మేసి.. అడ్డంగా దొరికిపోయిన ఎస్సై
Advertisement

Amberpet SI: హైదరాబాద్ అంబర్‌పేట్ ఎస్సై గన్ మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు గన్ మిస్సింగ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బంగారంతోపాటు తుపాకీని తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో గన్ అమ్మేసినట్టు ఎస్సై‌పై ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.

ఎస్సై భానుప్రకాష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
మరోవైపు ఎస్సై భాను ప్రకాష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్‌తోపాటు బంగారం ఎక్కడంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు భానుప్రకాష్‌ను విచారిస్తున్నారు. ఎస్సై భాను ప్రకాష్ మిస్సయిన బంగారాన్ని జనవరిలో రికవరీ చేసి ఇప్పటివరకు చూపించలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement

గన్‌ను రాయలసీమ ముఠాలకు అమ్మేశాడనే అనుమానాలు
మరోవైపు భానుప్రకాష్ తన గన్‌ను రాయలసీమ ముఠాలకు అమ్మేశాడనే అనుమానాలు పోలీస్ శాఖలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. రికవరీ చేసిన నాలుగు తులాల బంగారం అప్పగిస్తానని చెప్పి బాధితులతో కేసును క్లోజ్ చేయించాడు. అయితే కేసు క్లోజ్ అయ్యాక బాధితులకు బంగారం ఇవ్వలేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో భాను ప్రకాష్‌ను సస్పెండ్ చేశారు.

Also Read: దానం, కడియం రాజీనామా? మళ్లీ పోటీ చెయ్యొచ్చా!

Advertisement

గ్రూప్-2 ఉద్యోగం వచ్చిందని.. అంబర్‌పేట్ పీఎస్‌కు వచ్చిన భాను‌ప్రకాష్
సస్పెండ్ తర్వాత ఏపీలో గ్రూప్-2 ఉద్యోగం వచ్చిందని.. ఇటీవల అంబర్‌పేట పీఎస్‌కు వచ్చాడు భానుప్రకాష్. పీఎస్‌లో తన వస్తువులు తీసుకెళ్లాలని నమ్మించాడు. తీరా తన డ్రాలో గన్ కనబడటం లేదని స్టేషన్ ఇన్ స్పెక్టర్‌కి తెలిపాడు. దీంతో ఉన్నతాధికారుల సమక్షంలో డ్రా ఓపెన్ చేయగా.. గన్ కనబడలేదు. బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో అను మానం వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు భానుప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే భానుప్రకాష్ బెట్టింగ్‌లో 80లక్షలు పోగొట్టుకున్నట్లు విచారణలో తేలిందంటున్నారు పోలీసులు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×