E-Paper
Advertisement

BRAOU Bed Notification 2026: విద్యార్థులకు అలర్ట్.. అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ.. బీఈడీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

BRAOU Bed Notification 2026: విద్యార్థులకు అలర్ట్.. అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ.. బీఈడీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
Advertisement

BRAOU Bed Notification 2026: ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరానికి బీఎడ్‌ ప్రవేశాల అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ బీఈడీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

Advertisement

డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధికారిక పోర్టల్ www.braouonline.in ద్వారా విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించాలి. జనరల్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఫీజు రూ.1,000 గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రాయితీ ఇచ్చారు. వీరు రూ.750 ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది.

ఆగస్టు తొలి వారం అనగా రెండు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల్లో బీఎడ్‌ అర్హత పరీక్ష జరగనుంది. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 040-23680333 హెల్ప్‌లైన్ నంబరులో సంప్రదించవచ్చు. కోర్సు కాలవ్యవధి కనీసం రెండేళ్లు. గరిష్టంగా నాలుగేళ్లు వరకు ఉంటుంది. ఈ కోర్సు పూర్తిగా తెలుగు మీడియంలో మాత్రమే.

Advertisement

ఆగష్టు రెండున ప్రవేశ పరీక్ష,  రెండోవారంలో ఆడ్మిషన్ల కౌన్సెలింగ్

పరీక్షలు, అసైన్‌మెంట్లు, రికార్డులు తెలుగులో రాయాల్సి ఉంటుంది.రెండేళ్ల కోర్సుకు రూ.40,000 ట్యూషన్ ఫీజును చెల్లించాలి. ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-CBT జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహా మిగిలిన అన్ని కేటగిరీల వారికి క్వాలిఫైయింగ్ మార్కులు 35గా నిర్ణయించారు.

అర్హత విషయానికి వద్దాం. విద్యార్థులు BA, B.Sc., B.Com., BBA, BBM, BCA, B.Sc-హోమ్ సైన్స్, BE,B.Tech వంటి డిగ్రీలలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. SC/ST/BC/దివ్యాంగుల అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి.

ALSO READ: జీహెచ్‌ఎంసీ పవర్స్‌కు ఇక బ్రేక్.. పవర్స్ అంతా హైడ్రాకే.. క్యూర్ బిల్లు అసలు ప్లాన్ ఇదే..?

సాధారణ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ జూలై 24. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు 26 వరకు ఉంటుంది. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఈనెల 29 నుంచి మొదలవుతుంది. ప్రవేశ పరీక్ష ఆగస్టు మొదటి వారంలో జరగనుంది. ఆగస్టు రెండో వారం నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×