E-Paper
Advertisement

Moinabad Municipality: మొయినాబాద్​ మున్సిపాలిటీలో నిధులు గోల్‌మాల్? ఖర్చులపై ప్రశ్నిస్తే ఉద్యోగానికే ఎసరు?

Moinabad Municipality: మొయినాబాద్​ మున్సిపాలిటీలో  నిధులు గోల్‌మాల్? ఖర్చులపై ప్రశ్నిస్తే ఉద్యోగానికే ఎసరు?
Advertisement

Moinabad Municipality: మున్సిపాలిటీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషనర్​ నేతృత్వంలోనే ఎన్నికలకు అయ్యే ఖర్చులను చెల్లించాలి. కమీషనర్​ నమ్మకంతో అధికారి బాధ్యతలు అప్పగిస్తే అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో భోజనాలకు, జీరాక్స్​ షాప్​, ఫోటో, వీడియోగ్రాఫర్లు ఏర్పాటుతో పాటు ఓటర్​ లిస్ట్​ జాబితా, ప్రజలకు అవగాహాన కల్పించే ఓటు హక్కు ప్లేక్సీలు, కరపత్రాలు, స్ట్రాంగ్​ రూమ్స్​, విద్యుత్ సౌకర్యం, మోడల్ పొలింగ్​ బూత్​లుగా రూపోందించేందుకు నిధులను ఖర్చు చేయాలి. పనిచేసిన కూలీలకు నగదు చెల్లించడంలో అధికారి ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్​ మున్సిపాలిటిలో ఎన్నికల నిధుల ఖర్చుపై ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రశ్నిస్తే షోకాజ్​ నోటీస్​

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి. అందుకోసం ఖర్చు చేసిన నిధులను సక్రమంగా చెల్లించాలి. కానీ కమీషనర్​ అప్పగించిన అధికారి కేవలం అనుకూల వ్యక్తులకే అడిగినంత చెల్లిస్తూ… తోటి ఉద్యోగులకు అప్పగించిన పనికి నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పోలింగ్​ బూత్​ సమీపంలో చెత్త చేదారం లేకుండా, ఓటర్లకు అనుకూలంగా ఉండేవిదంగా చదును చేయడం, పిచ్చి మొక్కలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమైయ్యారు. అయితే మున్సిపాలిటీలో అంతా తానై పనిచేయిస్తున్నా అధికారి ఆదేశాలతో పనిచేసిన తోటి ఉద్యోగిని అధికారాన్ని వినియోగించుకొని ఇబ్బందులకు గురిచేశారు. ఎన్నికల నిధులు విడుదలైనప్పుడు పనిచేసే వాళ్లు నగదు చెల్లించడంలో ఇబ్బంది ఏమీటని ఉద్యోగులకు సంబంధించిన వాట్సప్​ గ్రూపులో బాధిత ఉద్యోగి మేస్సేజ్​ పెట్టారు. అతను పెట్టిన మేస్సేజ్​కి తప్పు చేయని అధికారి సమాధానం ఇవ్వాలి. కానీ ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇచ్చి వెధించినట్లు ప్రచారం సాగుతుంది. ఆ ఉద్యోగికి షోకాజు నోటీసుతో కలత చెంది అజ్క్షానతంలోకి పోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను కేటాయిస్తే సంబంధిత అధికారి దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also ReadBRS Vs Congress: హరీశ్ రావును అడ్డుకున్న జనాలు.. చెప్పులతో కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు

కమీషనర్​ ఆ అధికారి మద్దతు

ఓ డిఈ స్ధాయి అధికారి సీనియర్​ అసిస్టేంట్ను ఇబ్బందికి గురిచేసి ఉద్యోగానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చెప్పిన పనిచేయాలి తప్పా ఖర్చులను మీరే భరించాలనే విధంగా డీఈ స్ధాయి అధికారి సీనియర్ అసిస్టెంట్​ కు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దాంతో ఖర్చులను తనేందుకు భరించాలని అడిగితే ఉద్యోగం పోతుంది జాగ్రత్త అని డీఈ బెదిరించినట్లు ప్రచారం సాగుతుంది. ఆ మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులు ఈ విషయాలను బహిర్గతం చేసేందుకు కూడా జంకుతున్నారు. లోలోపన సమస్యలను దాచుకోని ఎన్నికల నిర్వహాణలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే మున్సిపాలిటీలో పనిచేసే సీనియర్​ అసిస్టెంట్ ఫోన్​ మూడు రోజులుగా స్వీచ్చ్​ ఆఫ్​ వస్తుంది. అధికారులకు కూడా అందుబాటులోకి రాకుండా పోయినట్లు సమాచారం. ఉద్యోగుల విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాలని ప్రయత్నం చేసిన ఫలితం లేదని మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ కమీషనర్​ ఆ డీఈ స్ధాయి అధికారి ఇద్దరు ఒక్కటే అనే ప్రచారం జోరుగా ప్రచారమైతుంది.

మొయినాబాద్​ మున్సిపాలిటిపై కన్నేయండీ

Advertisement

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మున్సిపాలిటీపై జిల్లా ఎన్నికల అధికారి ఓ కన్నేయాలని స్ధానికులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారుల మధ్య జరిగే గోడవలు తారస్ధాయి చేరితే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది. ప్రశాంత వాతావరణంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగాలంటే అధికారులందరూ సమన్వయం తప్పనిసరి. అంతేకాకుండా ఎన్నికల కమీషన్​ విడుదల చేసిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాల్సిన బాధ్యత కమీషనర్​పై ఉంటుంది. కానీ ఓ డీఈ అధికారిపై నమ్మకంతో ఖర్చు పెట్టడంతో సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. ఎన్నికల నిధుల దుర్వినియోగంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దృష్టి సాధించి విచారణ చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులు గుసగుసలాడుతున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: Jangaon District: జనగామ జిల్లాలో పులి, హైనా సంచారం.. బిక్కుబిక్కు మంటున్న ప్ర‌జ‌లు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×