E-Paper
Advertisement

కల్లూరు డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల హవా..!

కల్లూరు డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల హవా..!
Advertisement

Khammam News: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రభావం పెరిగి, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వెంసూరు మండలం – అక్రమాల కేంద్రంగా ఆరోపణలు వెంసూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు అసిస్టెంట్లుగా పనిచేస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. సాధారణ ప్రజల పనులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, “చేతులు తడిపితేనే పని” అనే పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పలుమార్లు ఫిర్యాదులు..  

భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల పరిష్కారంలో కూడా ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతివాటం కనిపిస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా, 10 ఎకరాలకు పైగా భూములు ఉన్న ఆర్థికంగా బలమైన వ్యక్తులకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ విషయాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, సంబంధిత మండల తహసీల్దార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సత్తుపల్లి మండలం – జీపివో / విఆర్ఎ వ్యవహారంలో అనుమానాలు సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓ మరియు వీఆర్ఏ వ్యవస్థలో అనుమానాస్పద పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. విద్యార్హతలు లేకపోవడంతో జీపివో స్థాయికి చేరుకోలేని కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ విఆర్ఎ స్థాయిలోనే కొనసాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Also Read: గులాబీ బాస్ ఈజ్ బ్యాక్.. ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఫిక్స్!

అక్రమాలు ఉన్నాయనే అనుమానాలు

అయితే కార్యాలయాల్లో విధులు నిర్వహించేది వారు కాకుండా, వారి కొడుకులు లేదా కుటుంబ సభ్యులు ప్రైవేట్‌గా వచ్చి పనులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా అసలు ఉద్యోగం ఒకరి పేరులో ఉండి, విధులు మరొకరు నిర్వహించడం ప్రభుత్వ నియమావళికి విరుద్ధమని ప్రజలు అంటున్నారు. అదనంగా, గిర్దావర్‌లకు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి కొంతమందిని కార్యాలయాలకు రాకుండా చేసినప్పటికీ, ఇంకా మిగిలిన ప్రైవేట్ వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర మండలాలు – ఇదే పరిస్థితి కొనసాగుతుందా? కల్లూరు డివిజన్ పరిధిలోని మిగతా మండలాల్లో కూడా ఇదే తరహా అక్రమాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగం ఒకరి పేరులో ఉండి, పని మాత్రం మరొకరు చేయడం, ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయాల్లో కీలక పాత్ర పోషించడం వంటి ఘటనలు సాధారణమైపోయాయని ప్రజలు చెబుతున్నారు.

ప్రజల ఆరోపణలు

Advertisement

• ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ పనుల్లో జోక్యం
• అసలు ఉద్యోగులు కాకుండా వారి కొడుకులు/కుటుంబ సభ్యులు విధులు నిర్వహించడం
• అర్హతలు లేకపోయినా ఉద్యోగాల్లో కొనసాగడం
• లంచం లేకుండా పనులు జరగని పరిస్థితి
• భూ సమస్యల పరిష్కారంలో అవకతవకలు
• కొంతమందిపై మాత్రమే చర్యలు, మిగతావారిపై గోప్యత

ప్రజల డిమాండ్ – పూర్తి స్థాయి ప్రక్షాళన

కల్లూరు డివిజన్ పరిధిలోని అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి
• అసలు ఉద్యోగులు ఎవరు?
• విధులు నిర్వహిస్తున్నవారు ఎవరు?
• ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఎంత?

అనే అంశాలను పూర్తిగా వెలికి తీసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “వెంసూరు మరియు సత్తుపల్లి మండలాల్లో వెలుగుచూస్తున్న ఈ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకుని, కల్లూరు డివిజన్ మొత్తంలో ప్రక్షాళన చేపట్టాలి” అని ప్రజలు సబ్ కలెక్టర్‌ను కోరుతున్నారు.

Also Read: సైబర్ దొంగలతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కు.. 32 మంది అరెస్టు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×