// // Sanitation Workers: పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. అలియాబాద్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం! -->
E-Paper
Advertisement

పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. అలియాబాద్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం!

పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. అలియాబాద్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం!
Advertisement

Sanitation Workers: స్వేచ్ఛ బ్యూరో: అలియాబాద్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత భద్రతా సామగ్రి (పీపీఈ కిట్లు), నూనెలు, సబ్బులను శుక్రవారం పంపిణీ చేశారు. అదే సందర్భంగా ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) నమోదు ధ్రువపత్రాలను అందజేశారు.

వైద్య సదుపాయాలపై కార్మికలకు అవగాహన

Advertisement

ఈ సందర్భంగా అధికారులు ఈఎస్ఐ పథకం ద్వారా లభించే ఉచిత వైద్య సేవలు, ప్రమాద బీమా, అనారోగ్య భృతి, ప్రసూతి ప్రయోజనాలు, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. పురపాలక చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులే వెన్నెముకలని, వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Also Read: మేడ్చల్‌లో బైక్‌పై వచ్చి ఫోన్ లాకెళ్లాడు.. కట్ చేస్తే సీసీటీవీ పుణ్యమా అని!

Advertisement

మాలతి రెడ్డి మాట్లాడుతూ..

అవసరమైన భద్రతా పరికరాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిరంతరం అందించేలా చర్యలు కొనసాగుతాయని చెప్పారు.వైస్ చైర్‌పర్సన్ మాలతి మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడైన కార్మికుడికి అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ..

మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో భద్రతా పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని, పరిశుభ్రమైన పని విధానాలతో ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Also Read: గుండ్లపోచంపల్లిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రైల్వే అండర్‌పాస్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు, బీజేపీ నేతలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×