E-Paper
Advertisement

జ్యోతిష్యులతో అవసరం లేదిక.. మీ జాతకాన్ని డిసైడ్ చేయనున్న ఏఐ యాప్!

జ్యోతిష్యులతో అవసరం లేదిక.. మీ జాతకాన్ని డిసైడ్ చేయనున్న ఏఐ యాప్!
Advertisement

Vedic App: స్వేచ్ఛ బ్యూరో: ఏఐ యుగంలోనూ సమస్త మానవాళికి ఉపయోగపడేలా ఓ అద్బుతమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన అనేక అప్లికేషన్లు కేవలం టెక్నాలజీ మీద ఆధారపడగా.. తొలిసారిగా ఏఐ తో పాటు, పురాతన శాస్త్రాల ఆధారంగా పనిచేసే సరికొత్త యాప్ రూపకల్పన జరిగింది. దేశంలోనే తొలి సారిగా ఒక్క అప్లికేషన్ తో, మనిషిని వేధిస్తున్న అనేక అవరోధాలను గుర్తించడమే కాదు, తక్షణ పరిష్కారాలు అందించడం ఆ యాప్ ప్రత్యేకత. ఈ యాప్ ను రూపొందించింది హైదరాబాదీలే కావడం విశేషం.

వేద ఆధారిత అప్లికేషన్..

హైదరాబాద్‌కు చెందిన ఆజా ఆస్ట్రోటెక్ కంపెనీ 5000 ఏళ్ల పురాతన బృహత్ పరాశర హోర శాస్త్రం ఆధారంగా దోష నివారణ యాప్‌ను ప్రారంభించింది. సమస్యలు మరియు దోషాలను గుర్తించి, బృహత్ పరాశర హోర శాస్త్రం సూత్రాల ప్రకారం సమర్థవంతమైన పరిష్కార మార్గాలను అందించే వేద ఆధారిత అప్లికేషన్ ఇది. శుక్రవారం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ బడిగా శ్రీకాంత్, రిటైర్డ్ జిల్లా జడ్జి హేమంత్ కుమార్ దింత్యాల, అలాగే టీ-హబ్ మాజీ సీఈఓ శ్రీనివాస్ రావు మహంకాళి కలిసి ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఇది పూర్తిగా బృహత్ పరాశర హోర శాస్త్రం ప్రాథమిక సూత్రాలపై రూపొందించిన ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్ అని కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామా తెలిపారు. పరాశర మహర్షి రచించిన ప్రాచీన వేద జ్యోతిష్య సూత్రాలను విశ్లేషించి, వాటిని ఆధునిక సాఫ్ట్‌వేర్ ఇంజిన్‌గా రూపొందించినట్లు వెల్లడించారు.

Advertisement

Also read: విద్యార్థులకు ఎన్డీఏ బిగ్ అలర్ట్.. రేపే పరీక్ష.. జామర్లు సీసీ కెమెరాల ముందే పరీక్ష..!

కాస్మిక్ బ్లూప్రింట్.. 

ఈ అప్లికేషన్ వినియోగదారుడి జనన సమయానికి సంబంధించిన గ్రహస్థితులను విశ్లేషించి కాస్మిక్ బ్లూప్రింట్ ను రూపొందిస్తుంది. యోగాలు, దోషాలు, సరైన పరిహారాలు, వ్యక్తిగత రిపోర్టులు, ముహూర్త సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త ఉద్యోగంలో చేరడం వంటి ముఖ్య సందర్భాలతో పాటు సి-సెక్షన్ ప్రసవాలు లేదా ప్రణాళికాబద్ధ శస్త్రచికిత్సల కోసం కూడా శుభ ముహూర్తాలను సూచించగలదు. భారతీయ ప్రవాసులకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ యాప్‌ను ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రారంభించారు. జూన్ నెలలో మరో 11 భారతీయ భాషల్లో కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది.

Advertisement

Also read: అవి లాగుల పార్టీలు.. అందుకే లాగుల గురించే మాట్లాడుతాయి..! లాగుల రాజ‌కీయాల‌పై గోల గోల‌..! అవి మాకేలా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×