E-Paper
Advertisement

Adulterated Oil : జంతు కళేబరాలే ముడిసరుకు.. కల్తీ నూనె తయారీ కలకలం..

Adulterated Oil : జంతు కళేబరాలే ముడిసరుకు.. కల్తీ నూనె తయారీ కలకలం..
Advertisement

Adulterated Oil : మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ నూనె కలకలం రేపింది. భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తాటికొండ శివారులో జంతువుల కళేబరాలతో నూనె తయారు చేస్తున్నారు. కల్తీ నూనెతో పాటు కల్తీ ఎరువులు సైతం తయారు చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కల్తీ నూనె, కల్తీ ఎరువులు తయారు చేసే కంపెనీ నుంచి విషవాయువులు వెలువడటంతో చిన్నారులకు శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలను కంపెనీ యాజమాన్యం గాలికి వదిలివేసింది. కంపెనీ పరిసర ప్రాంతాల్లో జంతు కళేబరాలను పడేయడంతో దుర్వాసనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

Advertisement

కల్తీ నూనె, కల్తీ ఎరువులు తయారు చేసే కంపెనీని బిగ్ టీవీ పరిశీలించింది. దశలవారీగా జంతు కళేబరాలను ప్రాసెసింగ్ చేసి నూనె పదార్థాలు, కాస్మోటిక్ పదార్థాలను తయారు చేస్తున్న విషయం బయటకు వచ్చింది. జంతు కళేబరాలను పౌడర్‌గా మార్చి చేపలకు, కోళ్లకు దాణాగా విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×