E-Paper
Advertisement

Food Adulteration: కప్ కేక్స్ లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి!

Food Adulteration: కప్ కేక్స్ లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి!
Advertisement

Food Adulteration: ప్రస్తుతం సమాజంలో ఆహార కల్తీ అనేది ఒక పెను భూతంగా మారి సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని కాటెదాన్‌లో వెలుగుచూసిన ఘటన ఇందుకు పరాకాష్ట. కుళ్లిపోయిన కోడిగుడ్లు, నాసిరకం పిండి పదార్థాలతో చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోనట్స్, కప్ కేకులను తయారు చేయడం చూస్తుంటే లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారాలు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నాయో అర్థమవుతుంది.

అయితే కాటెదాన్‌లోని ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’పై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ఈగలు ముసురుతున్న చోట తినుబండారాలను సిద్ధం చేయడం గమనార్హం. కేవలం ఆహారం పాడవకుండా ఉండటం కోసం ‘సోడియం బెంజోయేట్’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను మోతాదుకు మించి వాడుతున్నారు. ఇవి నేరుగా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా, పెరుగుతున్న పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కేవలం బేకరీ పదార్థాలే కాకుండా, మనం రోజువారీగా వాడే పాలు, నూనె, పప్పు ధాన్యాలు, చివరకు కూరగాయలు, పండ్ల వరకు కల్తీ కోరలు చాచింది. రంగు కోసం పండ్లకు కృత్రిమ రసాయనాలు పూయడం, పాలలో యూరియా లేదా డిటర్జెంట్ వంటివి కలపడం వంటి చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి. మార్కెట్లోకి వస్తున్న అనేక వంట సామాగ్రిలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ప్యాక్ చేసిన ఆహారం చూసి మోసపోకుండా దాని నాణ్యతను పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ అక్రమ వ్యాపారాల వెనుక ఉన్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటికీ, కల్తీ రాయుళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. కేవలం అధికారుల తనిఖీలే కాకుండా, సామాన్య ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. రోడ్డు పక్కన దొరికే రంగురంగుల ఆహార పదార్థాల పట్ల, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో వచ్చే బ్రాండ్ లేని వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేయడంతో పాటు, దోషులకు వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి మాఫియాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

Advertisement

Also Read:తగ్గని ఇంధన టెన్షన్.. సర్కార్ భరోసా ఇచ్చినా వీడని పెట్రోల్ తిప్పలు!

ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు బయటి ఆహారం కొనేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే సహజసిద్ధమైన ఆహారం అందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చాలా వరకు అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. ఆహార భద్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి, ఎక్కడైనా అనుమానాస్పదంగా కల్తీ జరుగుతుందని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×