E-Paper
Advertisement

Adibatla Kidnap Case Updates : వైశాలి కిడ్నాప్ కేసులో 31 మంది అరెస్ట్..

Adibatla Kidnap Case Updates : వైశాలి కిడ్నాప్ కేసులో 31 మంది అరెస్ట్..
Advertisement

Adibatla Kidnap Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా 32 మందిని పోలీసులు….. అరెస్ట్ చేసి, ఆదిభట్ల పీఎస్‌కు తరలించారు. వీరందరినీ కాసేపట్లో కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. ఉదయం నుంచి ప్రధాన నిందితుడి అరెస్టుపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. కానీ.. కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్‌ కేసులు నమోదు చేసినట్టు ఆదిభట్ల సీఐ నరేందర్‌ వెల్లడించారు.

తాను ప్రేమించిన యువతికి… మరొకరితో వివాహం కుదిరిందని, శుక్రవారం మన్నెగూడలోని ఆమె నివాసం నుంచి నిందితుడు నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. నిశ్చయ తాంబూలాలకు పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్‌రెడ్డి.. యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిఛర్‌, సీసీ కెమెరాలు, ఫోన్లు పగలగొట్టారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువును ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని నవీన్‌రెడ్డి కారులో అపహరించుకుపోయాడు. సుమారు 40 నిమిషాల పాటు గొడవ జరిగింది. పక్కా రెక్కీతో యువతి అపహరణ జరిగింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు… ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి… 6 గంటల్లో యువతి ఆచూకీ కనుక్కున్నారు.

Advertisement

యువతి అపహరణకు ముందు అనుచరులు, తన టీ దుకాణాల్లో పని చేసే సిబ్బందిని నవీన్‌రెడ్డి ఆఫీసుకు పిలిచాడు. మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. మద్యం మత్తులో ఉన్నవారిని…. కారులో యువతి ఇంటికి తీసుకెళ్లాడు. యువతి ఇంటిపై నవీన్‌ అనుచరులు, సిబ్బంది దాడి చేశారు. ప్రణాళిక ప్రకారమే యువతి ఇంటికి అందర్ని నవీన్ తీసుకొచ్చాడు. యువతి కిడ్నాప్ తర్వాత వివిధ మార్గాల్లో దుండగులు పారిపోయారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×