E-Paper
Advertisement

Addanki Dayakar: విపక్షాలపై అద్దంకి దయాకర్ మండిపాటు, అలా చేయడం నచ్చలేదేమో!

Addanki Dayakar: విపక్షాలపై అద్దంకి దయాకర్ మండిపాటు, అలా చేయడం నచ్చలేదేమో!
Advertisement

Addanki Dayakar: రేవంత్ సర్కార్ చేపట్టిన కుల గణనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఈ వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. తాము సాధించిన కులగణన విజయం కొందరు ప్రతిపక్ష నాయకులకు నచ్చట్లేదన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అద్దంకి దయాకర్. కేవలం మూడు నెలల్లోపు సర్వే రిపోర్టును ప్రజల ముందు పెట్టిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు. ఈ సర్వేను ప్రజలంతా హర్షిస్తున్నారని చెప్పారు.

Advertisement

గత ప్రభుత్వంలో సకల జనుల సర్వే పేరిట రికార్డు నమోదు చేసిందని, కానీ దానికి సంబంధించిన డీటేల్స్ బయటకు రాలేదన్నారు. పబ్లిక్ డొమైన్‌లో సర్వే నివేదిక పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు అసెంబ్లీలోగానీ కేబినెట్‌లో గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదని వివరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని మా ప్రభుత్వం కేవలం మూడు నెలల్లో చేసి చూసించిందన్నారు దయాకర్. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని మనసులోని మాట బయటపెట్టారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్.

Advertisement

ALSO READ:  ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండురోజులు అక్కడే మకాం.. ఎందుకు?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×