// // Hookah Raids: నిబంధనలు అతిక్రమిస్తే ఊపేక్షించేది లేదు.. అర్ధరాత్రి హుక్కా అడ్డాలపై మెరుపు దాడులు.. పోలీసుల ఉక్కుపాదం -->
E-Paper
Advertisement

Hookah Raids: నిబంధనలు అతిక్రమిస్తే ఊపేక్షించేది లేదు.. అర్ధరాత్రి హుక్కా అడ్డాలపై మెరుపు దాడులు.. పోలీసుల ఉక్కుపాదం

Hookah Raids: నిబంధనలు అతిక్రమిస్తే ఊపేక్షించేది లేదు.. అర్ధరాత్రి హుక్కా అడ్డాలపై మెరుపు దాడులు.. పోలీసుల ఉక్కుపాదం
Advertisement

Hookah Raids: హైదరాబాద్ నగర శివార్లలోని ఎల్బీనగర్, నాగోల్ పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న హుక్కా సెంటర్లపై ఏసీపీ కృష్ణయ్య ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఆయన, తన బృందంతో కలిసి శనివారం అర్ధరాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా నివాస ప్రాంతాల మధ్య యువతను వ్యసనాల వైపు మళ్లిస్తున్న ఈ కేంద్రాల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. స్థానిక అధికారులకు కూడా ముందస్తు సమాచారం లేకుండా ఏసీపీ స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం.

సేహరి కేఫెపై ఆకస్మిక దాడి – 25 మంది పట్టివేత
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో ఉన్న ‘సేహరి కేఫె’ హుక్కా సెంటర్ ప్రధాన లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా విచ్చలవిడిగా హుక్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో హుక్కా సేవిస్తున్న 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుండి పెద్ద ఎత్తున హుక్కా పాట్‌లు, వివిధ రకాల ఫ్లేవర్లు, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. ఏసీపీ నేరుగా రంగంలోకి దిగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

Advertisement

‘ఎల్వోసి’ సెంటర్‌పై పోలీసుల పంజా
నాగోల్ దాడుల అనంతరం, ఎల్బీనగర్ పరిధిలోని ‘ఎల్వోసి’ (LOC) హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడులు కొనసాగించారు. ఇక్కడ నిబంధనలను తుంగలో తొక్కి యువతను ఆకర్షిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, మరో 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 37 మంది యువకులు పోలీసుల పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ కేంద్రాల నిర్వాహకులపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రక్త నమూనాల సేకరణ.. డ్రగ్స్ కోణంలో విచారణ
కేవలం హుక్కా మాత్రమే కాకుండా, ఈ కేంద్రాల్లో మత్తు పదార్థాల వినియోగం ఏమైనా జరుగుతోందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 37 మంది యువకుల నుండి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు ఏసీపీ కృష్ణయ్య వెల్లడించారు. ఈ నివేదికలో ఒకవేళ డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే, సంబంధిత వ్యక్తులపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. యువత తమ బంగారు భవిష్యత్తును ఇలాంటి వ్యసనాల కోసం పాడు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.

Advertisement

Also Read: పాడి కౌశిక్ రెడ్డికి ఝలక్.. తిరగబడ్డ అనుచరులు.. పార్టీ మారేందుకు సన్నద్ధం!

విధుల్లో నిర్లక్ష్యంపై పోలీసు అధికారులకు ఛార్జ్ మెమోలు
శాంతిభద్రతల పరిరక్షణలో, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనలో అలసత్వం ప్రదర్శించిన స్థానిక సెక్టార్ ఎస్ఐకి ఇప్పటికే ఏసీపీ ఛార్జ్ మెమో జారీ చేశారు. నగరంలో ఎక్కడైనా అక్రమంగా హుక్కా సెంటర్లు నిర్వహించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి కేంద్రాల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని ఆయన కోరారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×