E-Paper
Advertisement

ACB Probe: రంగారెడ్డి హెల్త్ ఆఫీసుపై ఏసీబీ కన్ను.. సీక్రెట్ నిఘా పెట్టిన టీమ్..!

ACB Probe: రంగారెడ్డి హెల్త్ ఆఫీసుపై ఏసీబీ కన్ను.. సీక్రెట్ నిఘా పెట్టిన టీమ్..!
Advertisement

ACB Probe: స్వేచ్ఛ బ్యూరో: రంగారెడ్డి డీఎమ్ హెచ్ వో కార్యాలయంపై ఏసీబీ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్ చార్జ్ డెమోపై నిత్యం ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ ఫోకస్ పెట్టినట్లు సెక్రటేరియట్ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఇన్ చార్జ్ డెమో కు సంబందించిన ప్రైమరీ ఇన్ ఫర్మేషన్ ను ఏసీబీ సేకరించినట్లు తెలిసింది. ఆయన సర్వీస్ హిస్టరీ వెరిఫికేషన్ తో పాటు 2016 నుంచి ఇప్పటి వరకు ఆయన వ్యవహార శైలీపై కూడా ఏసీబీ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆయనపై ప్రభుత్వానికి కంటిన్యూగా వస్తున్న ఫిర్యాదులు ఆధారంగా ఇంటర్నల్ గానూ ఎంక్వైయిరీ జరుగుతున్నట్లు సమాచారం. హెల్త్ సెక్రటరీ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. సదరు డెమో పనితీరు, వ్యవహర శైలీని తెలుసుకున్న ఉన్నతాధికారులు కూడా అవాక్కవుతున్నారట. పూర్తి స్థాయి ఎంక్వైయిరీ తర్వాత చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నది. మరోవైపు ఏసీబీ రెయిడ్స్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

పుష్కలంగా డీహెచ్ అండదండలు..?

ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జ్ డెమోగా వర్క్ చేస్తున్న అధికారికి డైరెక్టర్ ఆఫ్​ పబ్లిక్ హెల్త్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఉద్యోగుల్లో చర్చజరుగుతుంది. తనకు ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వంలోని పెద్దల వరకు తెలుసునని, తనను ఎవరూ ఏమీ చేయలేరనే ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తున్నది. యూనియన్ లో యాక్టివ్ గా ఉండే తనపై యాక్షన్ తీసుకునే ధైర్యం ఉన్నతాధికారులు లేదనే ప్రచారం చేస్తున్నారట. రంగారెడ్డి డీఎమ్ హెచ్ వో కార్యాలయంలో లాంగ్ స్టాండింగ్ అధికారిగా ఉన్నప్పటికీ, తమ లీడర్ పై ఎలాంటి ప్రభావం లేదంటేనే ఆయన శక్తిసామార్థ్యాలు ఊహించుకోవాలని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. డీఎమ్ హెచ్ వోలు ఎవరు రావాలనే దానిపై కూడా ఆ ఇన్ చార్జ్ డెమో సలహాలు ఇస్తున్నారంటేనే ఆ కార్యాలయం పరిస్​థితిని ఊహించుకోవచ్చని కోఠిలో ఓ అధికారి తెలిపారు.

Advertisement

Also Read: తెలంగాణలో ఇళ్లకు కరెంట్ మీటర్ల గండం: జగదీష్ రెడ్డి!

వచ్చే ఫిర్యాదులు నిజమేనా…?

ఇన్ చార్జ్ డెమోపై రిపిటెడ్ గా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలను కూడా ఇంటర్నల్ గా ఏసీబీ సేకరిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్లు, స్థలాలు, ఇతర ప్రాంతాల్లో స్థలాలు, గెస్ట్ హౌజ్ లు వంటివి ఉన్నాయా? లేదా? అనే దానిపై సిక్రెట్ గా రిపోర్టు సేకరిస్తున్నారు. ఆ తర్వాత తనిఖీలు కూడా జరిగే ఛాన్స్ ఉన్నదని జీఏడీలోని ఓ అధికారి తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉండకూడదనేది ప్రభుత్వం సర్వీస్ రూల్స్ అని, దీనిపై ఏసీబీ సీరియస్ గా పనిచేస్తుందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు కూడా ఈ ఇన్ ఛార్జ్ డెమో పనితీరు, బిహేవర్ పై కూడా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సమాచారం. అంతేగాక రంగారెడ్డి జిల్లా కార్యాలయంలోనూ ఓ సిక్రెట్ టీమ్ సదరు అధికారిపై నిఘా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Also Read: Crop Procurement: విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చిపడేసిన మంత్రి తుమ్మల..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×