E-Paper
Advertisement

ACB Raids: తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. రూ.5 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు!

ACB Raids: తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. రూ.5 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు!
Advertisement

ACB Raids: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వరరావు నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆయనకు సంబంధించిన అక్రమ ఆస్తుల కేసు నమోదైంది. ఏసీబీ అధికారులు బండి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 5.02 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే వీటి మార్కెట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.

ధరణిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల ఆస్తులు
సోదాల్లో 1.15 కోట్ల రూపాయల విలువైన ఇల్లు, 1.43 కోట్ల రూపాయలు విలువ చేసే 17.10 ఎకరాల వ్యవసాయ భూమి, 70 తులాల బంగారం గుర్తించారు. వీటితో పాటుగా 92,000 రూపాయలు విలవైన వెండి ఆభరణాలు, 3.28 లక్షల విలువైన 23 రిస్ట్ వాచీలును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

ఏకకాలంలో వరంగల్, హనుమకొండ, ఖమ్మంలో సోదాలు
హనుమకొండ జిల్లాలోని ఖాజీపేట చైతన్యపురిలో బండి నాగేశ్వరరావు నివాసంతో పాటు, ఆయన సొంత జిల్లా ఖమ్మంలోని ఇతర ప్రదేశాల్లో కూడా సోదాలు చేశారు. నాగేశ్వరరావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తి మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు.

Also Read: నాగబాబుపై జనసైనికుల తిరుగుబాటు.. పవన్ ప్లాన్ ఏంటి?

Advertisement

పనిచేసిన సమయంలో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు
అయితే బండి నాగేశ్వరరావు తన సర్వీసు కాలంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఈ ఆస్తులను సమకూర్చుకున్నట్లు ఏసీబీ ఆరోపించింది.ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి, వరంగల్‌లోని ఏసీబీ కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత దర్యాప్తు జరుగుతోంది, మరియు అదనపు ఆస్తుల గురించి ధృవీకరణ కొనసాగుతోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×