E-Paper
Advertisement

Acb Raids: ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలం.. 25 చోట్ల సోదాలు..150 కోట్ల అక్రమాస్తులు

Acb Raids: ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలం.. 25 చోట్ల సోదాలు..150 కోట్ల అక్రమాస్తులు
Advertisement

Acb Raids: ఇరిగేష‌న్ శాఖ‌లో భారీ అవినీతి తిమింగ‌లం దొరికిపోయింది. ఇరిగేష‌న్ శాఖ‌లో ఏఈఈగా ప‌నిచేస్తున్న నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న‌ట్టు గుర్తించారు. నిఖేష్ రూ.150 కోట్ల అవినీతికి పాల్ప‌డినట్టు సోదాల్లో బ‌య‌ట‌ప‌డింది. ఉద‌యం ఆరు గంట‌ల నుండి సోదాలు చేస్తుండ‌గా ఇప్ప‌టికీ అత‌డి స్నేహితులు, బంధువ‌ల ఇండ్ల‌లో 25 చోట్ల‌ రైడ్స్ జ‌రుగుతూనే ఉన్నాయి.

నిఖేష్ కుమార్ వ‌ద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే అధికారులు సోదాలు నిర్వ‌హించారు. నిఖేశ్ కు భారీగా వ్య‌వ‌సాయ భూములు, బిల్డింగులు, ఫాం హౌసులు త‌దిత‌ర అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్టు గుర్తించారు. ఆస్తుల‌కు సంబంధించి ఎలాంటి ప‌త్రాలు లేకపోవ‌డంతో అధికారులు వివ‌రాలు న‌మోదు చేసుకున్నారు. అక్ర‌మాస్తుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రించ‌డంతో పాటూ ఇంట్లోని ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

గ‌తంలోనూ నిఖేశ్ ఇండ్ల‌పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించ‌గా అక్ర‌మాస్తులు గుర్తించి కేసులు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తోంది. అప్పుడు స‌స్పెండ్ చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న తీరులో మార్పు రాలేదు. మ‌రోసారి ఆయ‌న ప‌ట్టుబ‌డ‌టంతో జైలుశిక్ష సైతం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఎంతమంది అధికారులు ప‌ట్టుబ‌డుతున్నా లంచాలు తీసుకునేవారి తీరులో మార్పు రావ‌డంలేదు. ప్ర‌జ‌ల వ‌ద్ద డ‌బ్బులు తీసుకుంటూ.. అక్ర‌మ ప‌ర్మిష‌న్ లు ఇస్తూ కోట్ల‌కు ప‌డ‌గ ఎత్తుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×