E-Paper
Advertisement

ACB Raids: ఏసీబీ వలకి చిక్కిన భారీ తిమింగలం.. అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు, రూ.100 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!

ACB Raids: ఏసీబీ వలకి చిక్కిన భారీ తిమింగలం.. అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు, రూ.100 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!
Advertisement

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య అధికారికంగా ప్రకటించారు.

ఎనిమిది చోట్ల ఏకకాలంలో తనిఖీలు

Advertisement

వెంకట్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు, మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, రాక్ టౌన్ కాలనీలోని ఆయన ప్రధాన నివాసంతో పాటు మంచిరేవులలో ఉన్న ఒక విల్లాలో కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వీటితో పాటు ఆయన స్వగ్రామమైన మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలోని మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగాయి. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

రూ. 100 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు

Advertisement

ప్రాథమిక విచారణ ప్రకారం.. వెంకట్ రెడ్డి సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులను కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో విలువైన భూములు, స్థలాలు, విల్లాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన క్రయవిక్రయ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎలా వచ్చాయనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

కీలక పత్రాల సీజ్

సోదాల సమయంలో దొరికిన నగదు, బంగారం వివరాలతో పాటు ఆదాయ వ్యయాలకు సంబంధించిన డైరీలను, బ్యాంకు లావాదేవీల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ‘నిందితుడి ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఆయన అధికారిక ఆదాయానికి, ప్రస్తుతం ఉన్న ఆస్తులకు మధ్య పొంతన లేదని స్పష్టమవుతోంది. స్వాధీనం చేసుకున్న ప్రతి పత్రాన్ని విశ్లేషించిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం’ అని డీఎస్పీ సాంబయ్య వివరించారు. ఈ వ్యవహారంలో బంధువుల పేరిట ఉన్న బినామీ ఆస్తులపై కూడా ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం మరిన్ని కోట్లలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిపై ఈ స్థాయిలో ఏసీబీ దాడులు జరగడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ALSO READ: Sajjanar IPS: తిరుమలగిరి రోడ్డు ప్రమాదం.. సజ్జనార్ రోడ్ సేఫ్టీ టిప్స్.. GHMCకీ చెప్పండని జనాలు కామెంట్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×