E-Paper
Advertisement

ACB Raids: అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. చూసి కంగు తిన్న అధికారులు

ACB Raids: అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. చూసి కంగు తిన్న అధికారులు
Advertisement

ACB Raids in Nizamabad(Local news Telangana): నిజామాబాద్ లో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. మున్సిపల్ ఆఫీసులో పని చేసే ఓ అధికారి ఇంట్లో నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు ఉన్నట్లు వారు గుర్తించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతడు ఆదాయానికి మిచి భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

Also Read: ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని గుత్తేదారే భరిస్తారు: ఉత్తమ్

Advertisement

ఇందుకు సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరేందర్ ఇంటితోపాటు కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆ ఆఫీసర్ అసలు రంగు బయటపడింది. ఏసీబీ సోదాల్లో మొత్తం రూ. 2,93,81,000 నగదు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. మొత్తం రూ. 6 కోట్ల 7 లక్షల విలువగల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×