E-Paper
Advertisement

Abids Taj Mahal Hotel: ఆ హోటల్‌లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?

Abids Taj Mahal Hotel: ఆ హోటల్‌లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?
Advertisement

Food Safety Officers Ride on Taj Mahal Hotel: రాప్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లలలో తనీఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాలతో సంబంధిత నిర్వాహకులు చలగాటం ఆడుతున్నారు. ఏకంగా పాడైన ఆహారం, కుళ్లిన మాంసంతోపాటు కిచెన్ లో అపరిశుభ్రంగా ఉండడం, సురక్షితం కాని నీటితో పాత్రలను శుభ్రం చేయడం వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజాగా, హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ నిర్వాహకం బయటపడింది.

వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో తాజ్ మహల్ హోటల్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడికి ఇరు రాష్ట్రాల నుంచి ప్రజలు భోజనం చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే ఇటీవల ఈ హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన స్నేహితులకు షాక్ తగిలింది. అశోక్ కుమార్ స్నేహితులతో కలిసి భోజనం ఆర్డర్ చేసుకున్నాడు. నిర్వాహకులకు భోజనం ఇచ్చిన తర్వాత తింటుండగా.. ఏకంగా పప్పులో పురుగు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయారు. దీంతో ఆ పప్పును పరిశీలంచగా అందులో జెర్రీ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆందోళనకు గురై ఈ విషయాన్ని సిబ్బంది దృష్టి తీసుకెళ్లగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

Advertisement

అయితే, మేము కూడా ఇదే పప్పు తిన్నాం.. మాకేంద కాలేదు కదా.. ఎందుకు అనవసరంగా గొడవలకు దారి తీస్తారు? అంటూ నిర్వాహకులు సమాధానం చెప్పినట్లు బాధితులు ఆరోపించారు. అనంతరం జెర్రి ఉన్న పప్పును లాక్కుని బయటకు పడేశారు. దీంతో హోటల్‌లో భోజన్ ఆర్డర్ చేసుకున్న వారు తినకుండానే వెళ్లిపోయారు. హోటల్ నిర్వాహకులు అశోక్ కుమార్ తో ఇష్టానుసారంగా మాట్లడడంతో బాధితుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే హోటల్‌లో తనిఖీలు నిర్వహించినట్లు హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ తెలిపారు. సుందర్ రావు హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌లో భాగంగా తాజ్ మహల్ హోటల్ నిర్వహిస్తున్నారని, ఈ మేరకు ఇందులోని పలు ఫుడ్ పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపించామన్నారు. కిచెన్ తోపాటు ఇతర ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉందని వెల్లడించారు.

Advertisement

ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బయటకు తాజ్ హోటల్ అంటూ పేరు మాత్రమే కానీ లోపల చూస్తే అంతటా గలీజ్‌గా ఉందన్నారు. హోటల్ లో పారిశుద్ధ్యం పాటించడం లేదన్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో కనీసం క్వాలిటీ పాటించడం లేదని, కుళ్లిన పదార్థాలు బయటపడ్డాయని చెప్పారు. మెస్ నిర్వాహణ సరిగ్గా లేదని, చాలా లోపాలు ఉన్నాయని, కిచెన్ రూంలో బొద్దికంలు, ఆహారం నిల్వ చేసే పదార్ధాలపై మూతలు కూడా ఉంచడం లేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Also Read: కొత్త లుక్‌లో భట్టి విక్రమార్క… ప్యాంట్, షూట్‌ వేసి అమెరికాలో హల్చల్

ఇదిలా ఉండగా, హోటల్ సరిగ్గా నిర్వహించని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంజాయితీ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×