E-Paper
Advertisement

Hyderabad : ఆ ఆయిల్ రాస్తే జుట్టంతా రాలిపాయే.. బ్యూటీపార్లర్‌పై కంప్లైంట్..

Hyderabad : ఆ ఆయిల్ రాస్తే జుట్టంతా రాలిపాయే.. బ్యూటీపార్లర్‌పై కంప్లైంట్..
Advertisement
Hyderabad

Hyderabad : ఏదో అనుకుంటే.. ఏదో జరిగింది అంటూరు. అది.. ఈ మహిళ విషయంలో నిజమైంది. భర్తకు అందంగా కనిపించాలని అనుకుంది. దాని కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. కృత్రిమ అందంతో.. మెుగుడుని ఆశ్చర్య పర్చాలనుకుంది. చివరకు తన ప్రయత్నం బెడిసికొట్టింది.

Advertisement

ఓల్డ్‌ సిటీకి చెందిన ఓ మహిళ…అందం మెరుగుపరుచుకునేందుకు బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరిక తీర్చాలని ఆశపడింది. పార్లర్‌లో పొడుగ్గా ఉన్న ఆమె హెయిర్ కట్ చేసింది బ్యూటీషియన్. స్పెషల్ హెయిర్ ఆయిల్‌తో మర్దనా చేసింది. ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చిన ఆమె.. భర్తకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా చెబుదామనుకుంది. సీన్‌ కట్‌ చేస్తే… జుట్టంతా రాలిపోయి కనిపించడంతో కంగుతింది.

కొత్త అందం మాటెలా ఉన్నా… ఉన్న జుట్టు రాలిపోవటంతో ఆ మహిళ కంగారుపడింది. భార్య హెయిర్ పోవడం చూసిన భర్త కూడా షాక్‌కు గురయ్యాడు. అందగా కనిపించాలనుకున్న భార్యకు… ఉన్న వెంట్రుకలు ఊడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

Advertisement

బ్యూటీ పార్లర్‌లో తన జుట్టుకు రాసిన హెయిర్ ఆయిల్ వల్లే తన వెంట్రుకలు ఊడిపోతున్నాయని మండిపడింది బాధితురాలు. ఆ షాప్ దగ్గరికి వెళ్లి గొడవ చేసింది. ఊడిపోతున్న వెంట్రుకలు పట్టుకుని ఆబిడ్స్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. సదరు బ్యూటీ పార్లర్‌ యజమనిపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు సాగిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×