E-Paper
Advertisement

Hyderabad: ఆంటీతో స్టూడెంట్ ఎఫైర్.. అలా ముగిసింది..

Hyderabad: ఆంటీతో స్టూడెంట్ ఎఫైర్.. అలా ముగిసింది..
Advertisement

Hyderabad: అతని వయస్సు 19. డిగ్రీ చదువుతున్నాడు. ఓ ఆంటీతో అతడికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్దిరోజులు సీక్రెట్‌గా ఈ వ్యవహారాన్ని కొనసాగించారు. ఉన్నట్టుండి అతడు ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

మంగోల్‌కు చెందిన లగిశెట్టి అభిషేక్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. పాకెట్ మనీ కోసం సుచిత్ర ప్రాంతంలోని ఓ శాపింగ్‌మాల్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. దగ్గర్లోనే స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటూ ఉదయం.. కాలేజీ సాంయత్రం జాబ్ చేస్తున్నాడు.

Advertisement

అలా కొద్దిరోజులకు షాపింగ్ కాంప్లెక్స్‌లో అభిషేక్‌కు ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ దగ్గరయ్యారు. వారిద్దరి మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని కొద్దిరోజులు కొనసాగించారు. ఆ తర్వాత వివాహిత అభిషేక్‌కును దూరం పెట్టడం మొదలు పెట్టింది. అభిషేక్‌ను క్రమంగా దూరం చేసుకుంటూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

వివాహిత మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని అభిషేక్ గమనించాడు. ఆమెను నిలదీశాడు. ఈక్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదేరోజు సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అండగా ఉండాల్సిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సదరు మహిళపై పోలీసులకుఫిర్యాదు చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×