// // Hyderabad News: శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఆహుతైన అలంకరణ వస్తువులు -->
E-Paper
Advertisement

శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటలకు ఆహుతైన అలంకరణ వస్తువులు, రంగంలోకి ఫైర్ ఇంజన్లు

శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటలకు ఆహుతైన అలంకరణ వస్తువులు, రంగంలోకి ఫైర్ ఇంజన్లు
Advertisement

Hyderabad News: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అలంకరణ వస్తువులు నిల్వ ఉంచే భారీ గిడ్డంగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలం నుంచి భారీగా మంటలు, దట్టమైన పొగలు వెలువడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం, గోడౌన్‌లో చెలరేగిన మంటలు

Advertisement

అసలే ఎండాకాలం.. నిప్పురవ్వలు.. కరెంట్ తీగలు.. షార్ట్ సర్క్యూట్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మంటలు అట్టుకోవడం ఖాయం. సరిగ్గా భారీ గొడౌన్‌లో అదే జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతం పరిధిలోని శివరాంపల్లిలో అలంకరణ వస్తువులు నిల్వ ఉంచే గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్ నుంచి భారీ ఎత్తున మంగలు ఎగిసిపడ్డాయి.

దీనికితోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఘటన నుంచి స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. గోడౌన్ పక్కనే ఉన్న నివాస గృహాలకు మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల భవానాల్లోని ప్రజలకు భయంతో బయటకు పరుగులు తీశారు.

Advertisement

మంటలకు ఆహుతైన అలంకరణ వస్తువులు

అయితే గోడౌన్‌లో డెకరేషన్‌కు సంబంధించి ప్లాస్టిక్ సామాగ్రి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఏ విధంగా జరిగింది? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది? షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? అనేదానిపై ఫోకస్ చేశారు. ఎలాంటి ప్రాణనష్టం లేదుగానీ ఆస్తినష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×