E-Paper
Advertisement

Hyderabad : సనత్ నగర్ లో బాలుడు దారుణ హత్య.. నరబలిగా అనుమానం..?

Hyderabad : సనత్ నగర్ లో బాలుడు దారుణ హత్య.. నరబలిగా అనుమానం..?
Advertisement

Hyderabad News(Telangana Updates) : హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌ లో విషాదం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. నరబలి ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని అల్లాదున్‌ కోటిలో నివసించే రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారి వసీం ఖాన్‌ కుమారుడిని ఫిజా ఖాన్‌ అనే హిజ్రా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఫిజా ఖాన్‌ వద్ద వసీంఖాన్‌ చిట్టీలు వేశాడని, డబ్బుల చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య గురువారం వాగ్వాదం జరిగింది.

గురువారం సాయంత్రం వసీం ఖాన్‌ కుమారుడిని నలుగురు వ్యక్తులు బస్తీలోని ఓ వీధిలో అపహరించి.. ఫిజా ఖాన్‌ ఇంటి వైపునకు వెళ్లారు. బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీం ఖాన్‌ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించారు. ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. తొలుత బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారు. బకెట్‌ను ప్లాస్టిక్‌ సంచిలో తీసుకుని వెళ్లి నాలాలో వేసినట్లు తెలుస్తోంది. బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హిజ్రా ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఘటన స్థలానాకి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

బాలుడి మృతి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విచారం వ్యక్తం చేశారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×