E-Paper
Advertisement

Adilabad : రాత్రి వేళ అడవి పందులతో తిప్పలు.. ఈ యువకుడు ఏం చేశాడంటే?

Adilabad : రాత్రి వేళ అడవి పందులతో తిప్పలు.. ఈ యువకుడు ఏం చేశాడంటే?
Advertisement
TS Today news

Adilabad news(TS today news):

పైన కనిపించే ఫొటోలో యువకుడి వేషధారణ చూస్తే ఎవరైనా బొగ్గు గని కార్మికుడు అనుకుంటారు. నిజానికి ఆ యువకుడు పంట పొలాల కాపలాదారుడు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని లోహారి గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు పండర బొజ్జు. రాత్రి వేళల్లో వెళ్తున్నప్పుడు దారిలో పాములు, అడవి పందులతో ప్రమాదాలు ఎదుర్కొనేవాడు. పొలంలో జంతువుల అలికిడి వినిపిస్తున్నా.. వెళ్లి వాటిని చూద్దామంటే చేతిలో ఉన్న టార్చిలైటు వెలుగు సరిపోయేది కాదు.

ఈ సమస్యలను అధిగమించేందుకు సింగరేణి కార్మికులు గనుల్లో తలకు ధరించే బ్యాటరీ లైటు తరహాలో టార్చిలైటు తయారు చేసుకోవాలని ఆలోచించాడు. ఎలక్ట్రిక్ సామాన్లు అమ్మే షాపులో అవసరమైన వస్తువులు కొనుగోలు చేశాడు. ఎలా తయారు చేయాలో బొజ్జు.. షాపులోనే అడిగి తెలుసుకున్నాడు. తరువాత యూట్యూబ్‌లోనూ దానికి సంబంధించిన వీడియోలను చూసి ఎక్కువ వెలుగు వచ్చే బ్యాటరీ లైటును రూపొందించాడు. పగటి పూట ఛార్జింగ్‌ చేస్తే రాత్రంతా పని చేస్తుందని చెబుతున్నారు. అలా ఈ యువకుడు చీకట్లో పడిన ఇబ్బందులే.. వెలుగు కావాలన్న ఆలోచనకు పునాది వేశాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×