E-Paper
Advertisement

TSPSC: మరో ఎగ్జామ్ వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ

TSPSC: మరో ఎగ్జామ్ వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ
Advertisement
tspsc-notification-for-group-2-jobs

TSPSC: పేపర్‌ లీక్‌ ఎఫెక్ట్‌తో టీఎస్‌పీఎస్సీలో పరీక్షల వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తో పాటు పలు పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మరో పరీక్షను వాయిదా వేసింది. ఏప్రిల్‌ 4న జరగాల్సిన హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షను రీషెడ్యూల్‌ చేసింది. ఈ పరీక్షను తిరిగి జూన్‌ 17వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్షను యథావిధిగా నిర్వహించాలా లేదా కొంత వ్యవధితో రీషెడ్యూల్‌ చేయాలా అన్న అంశంపై సమాలోచనలు చేసిన కమిషన్ అధికారులు.. చివరకు పరీక్ష వాయిదా వైపే మొగ్గు చూపారు.

ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఇప్పటికే నాలుగు పరీక్షలను కమిషన్‌ రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్‌ వన్‌ ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి త్వరలోనే కొత్త తేదీలు ఖరారు చేయనున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×