E-Paper
Advertisement

Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు

Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు
Advertisement

Sarpancha elections: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. ఈ జిల్లాలో రెండు విడతల్లో జరగనున్న మొత్తం 167 సర్పంచ్‌ స్థానాలకు గాను, తొలిదశలోనే 18 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవాలన్నీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కావడం గమనార్హం.

ఈ సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యన్న ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన సర్పంచ్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సర్పంచ్‌లకు ఎమ్మెల్యే సన్మానం చేసి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏకగ్రీవాలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisement

సర్పంచ్‌లను ఉద్దేశించి ఎమ్మెల్యే గండ్ర సత్యన్న కీలక దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి వారు పారదర్శక పాలన అందించాలని కోరారు. ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించి.. తమ గ్రామాల్లోని ప్రజల అంచనాలను, ఆశయాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకునేలా సర్పంచ్‌లు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో ఎటువంటి లోపాలకు తావు ఇవ్వకుండా, అందరినీ కలుపుకుని పోయి సమష్టి కృషితో గ్రామాలను ముందుకు నడిపించాలని ఆయన చెప్పుకొచ్చారు.

ALSO READ: Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాజధాని కాదు.. ప్రధానమైన ఆర్థిక నగరం, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×