E-Paper
Advertisement

Government Hospital: దారుణం.. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత..

Government Hospital: దారుణం.. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత..
Advertisement

Government Hospital: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్న పిల్లల వార్డులో శిశువులకు డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో చిన్నారులకు ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇవ్వడంతో డాక్టర్లకు తల్లితండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే చిన్నారుల హెల్త్ కండీషన్‌పై తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే వివరాల ప్రకారం, రోజు ప్రకారం చిన్నారులకు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, ఒక ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చినట్లు సమాచారం తెలిపారు. దీంతో ఇంజెక్షన్ ఇచ్చిన అరగంటలోనే చిన్నారులకు వాంతులు, విరోచనాలు, తీవ్ర చలి, జ్వరం వంటి భయానక లక్షణాలు కనిపించాయి. ఈ పరిస్థితి చూసి తల్లిదండ్రులు భయాందోళనతో వణికిపోయారు. వారు వెంటనే డాక్టర్లను విచారించగా, ఆస్పత్రి సిబ్బంది మొదట సమాధానం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు, డాక్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. “మా పిల్లల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి, ఇది తప్పు ఇంజెక్షన్ వల్లే” అంటూ తల్లిదండ్రులు కేకలు పెట్టారు.

Advertisement

Also Read: రేవంత్ ఫోన్ చేసి.. నవీన్ యాదవ్ విజయంపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్..

అర్ధరాత్రి సమయంలో చిన్నారుల పరిస్థితి మరింత విషమించడంతో వారిని వెంటనే ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం 15 మంది చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వైద్యుల విరాల ప్రకారం, పిల్లల పరిస్థితి కొంచెం మెరుగుపడుతోంది, కానీ పూర్తి కోలుకోవడానికి రెండు మూడు రోజులు సమయం పట్టవచ్చు అంటున్నారు. అయితే జిల్లా మెడికల్ అధికారులు ఘటనపై పరిశోధన ప్రారంభించారు. ఇంజెక్షన్ల మందులు, స్టోరేజ్ వ్యవస్థలు, సిబ్బంది బాధ్యతలపై తనిఖీలు జరుగుతున్నాయి. తప్పు గుర్తించబడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×