E-Paper
Advertisement

Panchayat Funds: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల

Panchayat Funds: గ్రామ పంచాయతీలకు  గుడ్ న్యూస్.. 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల
Advertisement

Panchayat Funds:  పంచాయతీ పాలన ముగిసిన రెండేండ్ల వరకు ఎన్నికల నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. దీంతో 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల కావడంలో జాప్యం జరిగింది. గత కొన్ని రోజులుగా గ్రామంలోని ప్రధాన సమస్యలు పరిష్కారించాలంటే నిధుల లేమీ ఉండటంతో అభివృద్ధి కుంటుపడింది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహాణ పూర్తైన రెండు నెలలకు ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత పంచాయతీల్లో నిధుల జాతర కొనసాగుతుంది. ఇక పాలకవర్గం సమస్యల పరిష్కారానికి వార్డుల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఆ ప్రతపాదనలను ప్రాధాన్యత ప్రకారం పాలకవర్గం ఆమోదం తెలిపేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

Also Read: IDFC First Bank Scam: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో రూ.590 కోట్ల మోసం.. ప్రభుత్వ ఖాతాలతోనే!

రెండు విడుతల్లో నిధులు విడుదల

Advertisement

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం రెండు విడుతల్లో నిధులను పంచాయతీలకు విడుదల చేశారు. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలోని పంచాయతీల్లో నిధుల ఖర్చుపై పాలకవర్గంలోని సభ్యులకు దశల వారీగా శిక్షణ ఇచ్చారు. ఈ నిధుల విడుదలతో పల్లేల్లో ప్రగతికి సూచికగా మారింది. రంగారెడ్డిలో రూ.21.50కోట్లు, వికారాబాద్​లో 20.09 కోట్ల చొప్పున నిధులను పంచాయతీల ఖాతాల్లో జమకానున్నాయి. విడుదలైన నిధులతో నాలుగు భాగాలుగా అభివృద్ధి కార్యక్రమాలను విభజించాలని సర్పంచ్​లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్సీ జనాబా అత్యధికంగా ఉన్న ప్రాంతంలో 15శాతం అధిక నిధులు కేటాయించాలని ప్రణాళిక సంఘం సూచించింది. మౌళిక వసతుల సమస్యనే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

వేసవి పై అంచనాలు వేయాలి

గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పాలకవర్గంపై ఉంది. పంచాయతీ కార్యదర్శుల కూడా తాగునీటి సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి నివేధిక రూపోందించాలని జిల్లా అధికారులు సూచించారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోని ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సూచించారు. ఇప్పటికే ఎండలు వేసవి కాలంలా సమీపిస్తున్నాయి. లీకేజీ లను అరికట్టడం, వృథా నీటికి అడ్డుకట్ట వేయడం, పంచాయతీల్లో ఉన్న వనరులను అందుబాటులోకి తెచ్చి ప్రత్యామ్నాయం కల్పించడంపై దృష్టి సారించాల్సి ఉంది.

Advertisement

Also Read: Cm Revanth : రేవంత్ మళ్లీ పిలిచారు.. ఈసారైనా గులాబీ నేతలు వెళ్తారా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×