E-Paper
Advertisement

111 Movie: త్రిబుల్ వన్ జీవోపై సినిమా.. సర్కారుకు షాకేనా?

111 Movie: త్రిబుల్ వన్ జీవోపై సినిమా.. సర్కారుకు షాకేనా?
Advertisement
111 movie

111 Movie: టాలీవుడ్‌లో 111 పేరిట వస్తున్న సినిమా సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇటీవలే 111 జీవోను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎలక్షన్‌ సమయంలో ఇదే పేరుతో సినిమాను రూపొందించటం పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.

111 జీవో ఎత్తేసింది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని పర్యావరణ వేత్తలు విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పబోతున్నాడనే విషయం ఉత్కంఠగా మారింది. ట్రైలర్‌ చూస్తే మాత్రం.. భూముల అంశాలని చిత్ రయూనిట్ టచ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు ఈ సినిమా వ్యతిరేకంగా ఉంటుందా లేక పాజిటివ్‌గా ఉంటుందా? అనేది ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Advertisement

అభివృద్దికోసమే జీవో ఎత్తేస్తున్నామంటున్నప్రభుత్వం చెబుతుండగా.. దర్శకుడు సినిమా ద్వారా అదే చెప్పబోతున్నాడా.. లేక ఇతర సందేశం ఉంటుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. నూతన నటీనటులతో దర్శకుడు విజయ రాఘవేంద్ర తెరకెక్కించి.. జీవీ 111 కాన్సెప్ట్ టీజర్‌ సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

111 జీవో పరిధిలో వేల ఎకరాల భూమి ఉంది. జీవో ఎత్తేస్తే ఆ భూములు బంగారమే. కోట్లలో ధర పలుకుతుంది. భూమి అమ్ముకుంటే రైతు కూలీగా మారతాడంటూ.. టీజర్‌లో చెప్పించాడు డైరెక్టర్. అంటే, ఈ మూవీ ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగానే ఉంటుందా? ఉంటే ఎలక్షన్ టైమ్‌లో ఈ సినిమా కేసీఆర్ సర్కారుకు మైనస్‌గా మారుతుందా? చూడాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×