E-Paper
Advertisement

కావ్య పాప‌కు యువ‌రాజ్ వార్నింగ్..మ‌ర్యాద‌గా నా శిష్యుడికి కెప్టెన్సీ ఇవ్వు

కావ్య పాప‌కు యువ‌రాజ్ వార్నింగ్..మ‌ర్యాద‌గా నా శిష్యుడికి కెప్టెన్సీ ఇవ్వు
Advertisement

Yuvraj Singh:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) మార్చి 28వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభ మ్యాచ్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్ లో అదరగొట్టిన హైదరాబాద్.. బౌలింగ్ లో మాత్రం చేతులెత్తేసింది. ఇక ఇవాళ కేకేఆర్ లాంటి మరో బలమైన జట్టుతో ఢీ అంటే ఢీ అంటోంది స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్. అయితే ఇలాంటి నేపథ్యంలో SRH ఓనర్ కావ్య పాపకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్‌ యువరాజ్ సింగ్. ఇషాన్ కిషన్ పెద్ద దద్దమ్మ.. వాడికి ఎందుకు కెప్టెన్సీ ఇచ్చావ్.. నా శిష్యుడు అభిషేక్ శర్మకు ఇవ్వచ్చు కదా ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు యువరాజ్ సింగ్.

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

కావ్య పాపకు యువరాజ్ సింగ్ వార్నింగ్

Advertisement

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ప్యాట్ క‌మిన్స్‌ గాయం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చింది కావ్య పాప. అయినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయింది. అయితే ఈ నేపథ్యంలో కావ్య పాపను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు యువరాజు సింగ్. ఇషాన్ కిషన్ స్థానంలో అభిషేక్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలరాత మారిపోతుందని నిర్ణయించారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ ఆడుతున్నాడని గుర్తు చేశారు.

అతని సోల్, మొత్తం హైదరాబాద్ జట్టులోనే ఉంది. హైదరాబాదులో కూడా అభిషేక్ శర్మకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. హైదరాబాద్ జట్టును సారధిగా బాగా లీడ్ చేసే దమ్ము అభిషేక్ శర్మ లో ఉందని యువరాజ్ సింగ్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సేవలు అందిస్తున్న అభిషేక్ శర్మను కాదని ఇషాన్ కిషన్ కు ఎలా కెప్టెన్సీ ఇస్తామని నిలదీశారు. ఏడాది కింద వచ్చినోడు నీకు ఎక్కువయ్యాడా? అంటూ కావ్య పాపకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో అభిషేక్ శర్మకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉందమ్మా.. అది గుర్తించి నా శిష్యుడికి అవ‌కాశం ఇవ్వు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై కావ్య పాప ఎలా స్పందిస్తుందో చూడాలి.

యూవీ ట్రైనింగ్ లోనే రాటుదేలిన అభిషేక్ శ‌ర్మ‌

Advertisement

యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలోనే అభిషేక్ శర్మ రాటుదేలాడు. అంతకు ముందు పెద్దగా అభిషేక్ శర్మ గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకున్నాడో అప్పటి నుంచి అభిషేక్ శర్మ తలరాత మారిపోయింది. దీని ఫలితంగానే టీమిండియాలోకి వచ్చి సెటిల్ అయ్యాడు అభిషేక్. ఇప్పుడు నెంబర్ వన్ టీ20 ఆటగాడిగా రాణిస్తున్నాడు. అటు గిల్ కూడా యూవీ నేతృత్వంలోనే ట్రైనింగ్ తీసుకుని, కెప్టెన్ గా ఎదిగాడు.

 

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×