E-Paper
Advertisement

Yograj Singh: ధోని పెద్ద‌ జిత్తులమారి నక్క…CSK ప్లే ఆఫ్స్ కు వెళితేనే ఆడ‌తాడు, క్రెడిట్ దొబ్బేస్తాడు

Yograj Singh: ధోని పెద్ద‌ జిత్తులమారి నక్క…CSK ప్లే ఆఫ్స్ కు వెళితేనే ఆడ‌తాడు, క్రెడిట్ దొబ్బేస్తాడు
Advertisement

Yograj Singh:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండు జట్లు ఎలిమినేట్ కాగా.. మరికొన్ని జట్లు కూడా ఇంటి దారి పట్టనున్నాయి. అటు నిన్న లక్నో సూప‌ర్ జెయింట్స్‌ చేతిలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings ) ప్లే ఆఫ్స్ ( Playoffs) ఛాన్సులు మరింత క్లిష్టంగా మారిపోయాయి. అయితే ఇలాంటి క్రమంలో మహేంద్రసింగ్ ధోని (MS Dhoni) ఆడడం పైన యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ( Yograj Singh ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని జిత్తులమారి నక్క అంటూ ఫైర్ అయ్యారు. అవకాశవాది అంటూ మండిపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరితేనే ధోని ఆడతాడని.. లేకపోతే ఇంటికి వెళ్తాడని పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరితే వెంటనే జట్టులోకి చేరి.. క్రెడిట్ మొత్తం దొబ్బేస్తాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

ధోని పెద్ద‌ జిత్తులమారి నక్క…CSK ప్లే ఆఫ్స్ కు వెళితేనే ఆడ‌తాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఒకటే విషయం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. మహేంద్ర సింగ్ ధోని ఆడితే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సీజన్ దాదాపు 80 శాతం పూర్తయినా కూడా మహేంద్ర సింగ్ ధోని… ఎల్లో జెర్సీలో బరిలోకి దిగలేదు. మళ్లీ దిగుతాడనే నమ్మకం కూడా కనిపించడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే, ఇంటి దారి పట్టాల్సిందే. ఇలాంటి క్రమంలో యువరాజు సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని అవకాశవాదని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళితేనే అతడు ఆడతాడని బాంబు పేల్చారు.

ఒకవేళ ఇంటిదారి పడితే, సైలెంట్ గా ఉండిపోతాడని పేర్కొన్నారు. చెన్నై ప్లే ఆఫ్స్ బరిలో ఉంటే మాత్రం కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోని ఆడతాడని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటాడని చెప్పుకొచ్చారు. గతంలో వన్డే వరల్డ్ కప్ 2011 సమయంలో కూడా ఇలాగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. గాయం పేరుతో నాటకాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు యోగ్‌రాజ్ సింగ్. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం యువ క్రికెటర్లతో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకు వెళ్తోంది. ఇలాంటి క్రమంలో మహేంద్ర సింగ్ ధోని జట్టులోకి రావడం అనవసరము అని మరికొంతమంది భావిస్తున్నారు. ధోని వస్తే, సర్ఫ‌రాజ్ లాంటి యువ క్రికెటర్ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ధోని ఆడడం లేదని అంటున్నారు.

Advertisement

 

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

https://www.facebook.com/story.php?story_fbid=914138608336321&id=100092205693106&post_id=100092205693106_914138608336321&rdid=2zLQEpOYSSgWreVr#

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×