E-Paper
Advertisement

World Cup Final : ఫైనల్ మ్యాచ్ లో… సంగీత్, లేజర్ షో ఇంకాస్పెషల్ అట్రాక్షన్.. పాప్ సింగర్ దువా లిపా

World Cup Final : ఫైనల్ మ్యాచ్ లో… సంగీత్, లేజర్ షో ఇంకాస్పెషల్ అట్రాక్షన్.. పాప్ సింగర్ దువా లిపా
Advertisement
World Cup Final

World Cup Final : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఒక రేంజ్ లో జరగనుంది. ఏర్పాట్లు అదరహో అన్నట్టు జరిగిపోతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ కి ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ మోదీ స్టేడియం సిద్ధమైంది. అతిరథ మహారథులు అందరూ తరలి వస్తుండటం, ఇండియా ఫైనల్ కి చేరడంతో ప్రపంచ దేశాలన్నీ ముక్కు మీద వేలేసుకునేలా, ఒలింపిక్ గేమ్స్ ని తలపించేలా బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రోగ్రాం షెడ్యూల్ ని బీసీసీఐ విడుదల చేసింది. ఒక మెగా ఈవెంట్ కన్నా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టాస్ వేసిన అనంతరం 1.35 గంటల నుంచి 1.50 వరకు భారత వాయుసేన ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఎయిర్ బాటిక్ బృందం ఎయిర్ షో ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామంలో ప్రముఖ నేపథ్య గాయకుడు, గేయ రచయిత ఆదిత్య గద్వీతో సంగీత్ ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత తుషార్ జోషీ, ప్రీతమ్, జోనితా గాంధీ తదితరుల నేతృత్వంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సెకండ్ బ్యాటింగ్ లో మళ్లీ వచ్చే విరామ సమయంలో లేజర్ లైట్ షో ఉంటుంది.

Advertisement

ఇవికాకుండా అదనపు ఆకర్షణలు చాలా ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ దువా లిపా దుమ్ము రేపే ప్రదర్శన ఒకటి ఉంది. యూకే కి చెందిన ఈ లేడీ సింగర్ కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. అందులో మన క్రికెటర్లు కూడా ఉన్నారండోయ్.. శుభ్ మన్ గిల్, రాహుల్, కేన్ విలియమ్సన్ అందరూ కూడా దువా లిపా ఏ పాట పాడుతుందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మరి తనకెంత మంది ఫ్యాన్స్ ఉన్నారో చూశారు కదండీ…

ఇటీవల దువాలిపా పాడిన ‘హౌడిని ట్రాక్’రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించి గ్లోబల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇకపోతే ప్రపంచకప్  ముగింపు వేడుకల్లో దువా లిపా ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్  కానుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×