E-Paper
Advertisement

IND Vs ENG 5th Test : సిరాజ్ బిగ్ మిస్టేక్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

IND Vs ENG 5th Test : సిరాజ్ బిగ్ మిస్టేక్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Advertisement

IND Vs ENG 5th Test :   సాధారణంగా క్రికెట్ ఎవ్వరైనా పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని పొరపాట్లు మ్యాచ్ నే మార్చేస్తాయి. ఆ పొరపాట్ల కారణంగా మ్యాచ్ ను పక్క టీమ్ వారికి విజయం వరిస్తుంది. సరిగ్గా టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అదే జరిగింది. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి టెస్ట్ మ్యాచ్ లో సిరాజ్ అద్భుతమై ప్రదర్శన కనబరిచాడు. కానీ మ్యాచ్ నాలుగో రోజున అతను చేసిన ఒక పొరపాటు వల్ల టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా ఓడిపోతుందనే చెప్పవచ్చు.

Also Read : Test Jersey : టెస్ట్ క్రికెట్ లో తెల్ల జెర్సీలే ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా ?

Advertisement

ఇంగ్లాండ్ బ్యాటింగ్ అదుర్స్ 

ఓవల్ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఇంగ్లాండ్ (England)  జట్టు 374 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ రోజు ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 50 పరుగుల నుంచి ఆట మొదలుపెట్టింది. ఓపెనర్ బెన్ డకెట్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ అతడిని వెంటనే అవుట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఆలీ పోప్‌ను ఎల్‌బిడబ్ల్యుగా అవుట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో ఇది సిరాజ్‌కు ఆరో వికెట్. 106 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా (Team India)  మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. ఈ సమయంలో జో రూట్, హ్యారీ బ్రూక్ భాగస్వామ్యంపై అందరి దృష్టి పడింది. హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడుతూ బౌండరీలు కొట్టడం మొదలుపెట్టాడు. సరిగ్గా 35వ ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మొదటి బంతిని బ్రూక్ హుక్ షాట్ ఆడగా.. బంతి నేరుగా డీప్ ఫైన్ లెగ్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ చేతిలోకి వెళ్లింది.

Advertisement

సిరాజ్ క్యాచ్.. బిగ్ మిస్టేక్ 

సిరాజ్ క్యాచ్‌ను సునాయాసంగా పట్టుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో పెద్ద పొరపాటు చేశాడు. తాను బౌండరీకి ఎంత దగ్గరగా ఉన్నాడో మర్చిపోయి, బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ అడుగు నేరుగా బౌండరీ లైన్‌ను తాకింది. అంతే, అంతవరకు ప్రసిద్ధ్ కృష్ణతో సహా మొత్తం టీమ్ ఇండియా ముఖాల్లో ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. సిరాజ్ తాను చేసిన తప్పును నమ్మలేకపోయాడు. అతను తన చేతులతో ముఖం కప్పుకున్నాడు. అదే సమయంలో సంబరాలు చేసుకుంటున్న భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇంగ్లాండ్ అభిమానుల్లో మాత్రం కొత్త ఉత్సాహం నిండింది.

ఈ క్యాచ్ డ్రాప్ అయినప్పుడు హ్యారీ బ్రూక్ కేవలం 21 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి ఉన్నాడు. సిరాజ్ పొరపాటుతో అతనికి ఒక లైఫ్‌లైన్ లభించడంతో పాటు 6 పరుగులు కూడా లభించాయి. అక్కడి నుంచి బ్రూక్ మరింత దూకుడుగా ఆడాడు. అదే ఓవర్‌లో ప్రసిద్ధ్‌పై మరో 2 ఫోర్లు కొట్టి జట్టు స్కోరును త్వరగా 150 దాటించాడు. మొదటి సెషన్ ముగిసే సమయానికి బ్రూక్ కేవలం 30 బంతుల్లో 38 పరుగులు చేసి, రూట్‌తో కలిసి 63 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.  ఆ తరువాత 98 బంతుల్లో 111 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  దీంతో  ఇండియా ఓటమి పాలయ్యేందుకు చాలా దగ్గరగా ఉంది.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×