E-Paper
Advertisement

Ms Dhoni Play IPL 2025: ధోనీకి ఐపీఎల్ లో చోటు ఉందా? లేదా?

Ms Dhoni Play IPL 2025: ధోనీకి ఐపీఎల్ లో చోటు ఉందా? లేదా?
Advertisement

అలాంటి లెజండరీ క్రికెటర్లలో ఒకడిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. తనకి ఫ్రాంచైజీ నుంచి ఏడాదికి రూ.12 కోట్లు అందుతున్నాయి. అయితే, 2024 సీజన్ లో ధోనీ సాధారణ వికెట్ కీపర్ గా ఆడాడు.

కెప్టెన్ గా రాజీనామా చేసి రుతురాజ్ గైక్వాడ్ కి బాధ్యతలు అప్పగించాడు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ సమయంలో ప్రతీ జట్టు కూడా నలుగురు ఆటగాళ్లను మాత్రమే తమ దగ్గర ఉంచుకుని, మిగిలిన వాళ్లని వదిలేయాలి. అప్పుడందరూ మళ్లీ ఓపెన్ ఆక్షన్ లోకి వస్తారు.

Advertisement

ఇప్పుడు చెన్నయ్ సూపర్ కింగ్స్ కి సంకట స్థితి ఎదురైంది. అదేమిటంటే ధోనీ చేసేది వికెట్ కీపింగ్ మాత్రమే. తనెంత కాలం ఆడతాడో తెలీదు. మహా అయితే మరో ఏడాది మాత్రమే ఆడే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనని అట్టే పెట్టుకుని రూ.12 కోట్లు చెల్లించే పరిస్థితి లేదు. అందుకు ధోనీ కూడా అంగీకరించడం లేదు.

ఇదిలా ఉండగా మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలతో  ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగు జరిగింది. ఇందులో చెన్నై ఒక ప్రతిపాదన చేసింది. అదేమిటంటే అన్ క్యాప్డ్ రూల్ మళ్లీ తీసుకురావాలని కోరింది. దీనివల్ల ధోనిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆడించే అవకాశాలున్నాయి. అప్పుడు తనకి రూ.4 కోట్లు మాత్రమే ఇవ్వవచ్చు. అలా జట్టుకి భారం ఉండదు.

ఇంతకీ అన్ క్యాప్డ్ పాలసీ అంటే ఏమిటంటే.. 2008 ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఈ పాలసీ పెట్టారు. ఈ పద్ధతి ప్రకారం గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ క్రికెటర్ నైనా అన్ క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణిస్తారు. అంటే పాత క్రికెటర్లకి ఆదాయం పరంగా ఒక అవకాశం కల్పించినట్లవుతుందని బీసీసీఐ భావించింది. కాకపోతే ఫ్రాంచైజీలు ఎవరూ దీనిపై ఆసక్తి చూపించలేదు. దీంతో 2021లో ఈ పాలసీ రద్దు చేశారు.

Advertisement

ప్రస్తుతం చెన్నయ్ సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ హీరో ధోనీ కోసం ఈ రూల్ తీసుకురమ్మని కోరింది. దీనిపై బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ధోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను మ్యాచ్ లు ఆడుతుంటే చూసేందుకు జనం క్యూలు కడతారు. యాడ్స్ పెరుగుతాయి. ఐపీఎల్ కి ఒక కలరింగ్ ఉంటుంది. ఇన్నిలాభాలున్నాయి కాబట్టి  ధోనీ కోసం రూల్స్ ను సవరించక తప్పదని బీసీసీఐ భావిస్తోంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×