E-Paper
Advertisement

WTC Final : శ్రీలంక నుంచి పోటీ.. భారత్ ఫైనల్ కు చేరాలంటే.. లెక్కలివే..!

WTC Final : శ్రీలంక నుంచి పోటీ.. భారత్ ఫైనల్ కు చేరాలంటే.. లెక్కలివే..!
Advertisement

WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్లోకి ఇప్పటికే ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. ఇక ఫైనల్ చేరే రెండో జట్టుపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో టీమిండియా ముందున్నా .. శ్రీలంక జట్టు పోటీలో ఉండటంతో సమీకరణాలు ఆసక్తి రేపుతున్నాయి.

ఫైనల్ లో ఆసీస్..
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన WTC ఫైనల్ రేసులో ముందుకెళ్లింది. అయితే అనూహ్యంగా మూడో టెస్టులో ఓడిపోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. భారత్ పై మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ కు చేరుకుంది. మరో ఫైనల్‌ బెర్తు కోసం భారత్‌, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టు, న్యూజిలాండ్‌- శ్రీలంక మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ పై ఇప్పుడు సర్వాత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

భారత్ అవకాశాలేంటి..?
ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్‌ విజయం సాధిస్తే.. శ్రీలంక,న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌తో సంబంధం లేకుండా నేరుగా WTC ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ భారత్‌, ఆసీస్‌ మధ్య జరిగే నాలుగో టెస్టు డ్రా అయితే కివీస్-శ్రీలంక సిరీస్ ఫలితంపై సమీకరణాలు ఆధారపడి ఉంటాయి. న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే భారత్ ఆశలు గల్లంతవుతాయి. కానీ కివీస్‌పై 1-0 తేడాతో శ్రీలంక గెలిచినా భారత్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులోనూ భారత్‌ ఓటమిపాలై, న్యూజిలాండ్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే శ్రీలంక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అద్భుతం జరిగితే తప్పితే స్వదేశంలో న్యూజిలాండ్ ను ఓడించడం శ్రీలంకకు అంత ఈజీ కాదు. అందుకే ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో ఎలాంటి ఫలితం వచ్చినా భారత్ కే WTC ఫైనల్ అవకాశాలుంటాయి.

అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి భారత్, ఆసీస్‌ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమవుతుంది.మార్చి 9 నుంచే న్యూజిలాండ్, శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. జూన్‌ 7-11 మధ్య లండన్‌ ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×