// // Deccan Chargers To SRH: D చార్జర్స్ ను ఎందుకు బ్యాన్ చేశారు? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

అస‌లు డెక్కన్ చార్జర్స్ ను ఎందుకు బ్యాన్ చేశారు.. ? SRH జ‌ట్టు ఎలా వ‌చ్చింది

అస‌లు డెక్కన్ చార్జర్స్ ను ఎందుకు బ్యాన్ చేశారు.. ? SRH జ‌ట్టు ఎలా వ‌చ్చింది
Advertisement

Deccan Chargers To SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఐపీఎల్ మెగా టోర్నమెంట్ దాదాపు 19 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 18 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ టోర్నమెంట్ తాజాగా 19వ సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే 2008 సమయంలో 8 టీమ్స్ తో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్, ప్రస్తుతం 10 జట్లకు చేరుకుంది. అయితే అప్పట్లో డెక్కన్ చార్జర్స్ జట్టు ( Deccan Chargers) ఉన్న సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. అప్పటి డెక్కన్ చార్జర్స్ పైన బ్యాన్ విధించగా, భయంకరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తెరపైకి వచ్చింది. డెక్కన్ చార్జర్స్ కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. బలమైన ఆటగాలను కొనుగోలు చేసిన కావ్య పాప, ఏ మాత్రం తగ్గడం లేదు.

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

అసలు డెక్కన్ చార్జర్స్ ను ఎందుకు బ్యాన్ చేశారు ?

Advertisement

2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా, మొదటి సీజన్ నుంచి దాదాపు నాలుగు సీజన్ల వరకు డెక్కన్ చార్జర్స్ జట్టు కొనసాగింది. అంతేకాదు 2009లో చాంపియన్ కూడా అయింది డెక్కన్ చార్జర్స్. ఈ జట్టులో రోహిత్ శర్మ, ఆడమ్ గిల్ క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, ప్రజ్ఞాన్ ఓజా, గిబ్స్, సంగ‌క్క‌ర‌, డేయిల్ స్టెయిన్‌ లాంటి భయంకరమైన ప్లేయర్లు ఇందులో ఉన్నారు. ఇక డెక్కన్ చార్జెస్ ఓనర్ గాయత్రి రెడ్డి అన్న సంగతి తెలిసిందే. ఈమె వెంకట్రాంరెడ్డి కూతురు. వీళ్లకు డెక్కన్ క్రానికల్ న్యూస్ గ్రూప్.. తదితర వ్యాపారాలు ఉన్నాయి. నాలుగు సంవత్సరాల పాటు డెక్కన్ చార్జెస్ జట్టును సమర్ధవంతంగా నడిపించిన యాజమాన్యం.. ఆ తర్వాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న సభ్యులకు జీతాలు చెల్లించడంలో ఇబ్బంది పడింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం బ్యాంక్ గారెంటీ కింద చెల్లించాల్సిన రూ. 100 కోట్లు ఇవ్వడంలో డెక్కన్ చార్జర్స్ యాజమాన్యం అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసిన నేపథ్యంలో రంగంలోకి దిగింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. 2012 సెప్టెంబర్ లో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీని రద్దు చేసింది.

అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా పుట్టుకు వచ్చింది ?

2012లో డెక్కన్ చార్జర్స్ జట్టుపైన బీసీసీఐ బ్యాన్ విధించిన నేపథ్యంలో తెరపైకి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చింది. డెక్కన్ చార్జర్స్ పైన బ్యాన్ విధించిన నేపథ్యంలో అక్టోబర్ 2012లో వేలం జరిగింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీని సన్ టీవీ నెట్వర్క్ ఓనర్ కళానిధి మారన్ 85.05 కోట్లకు కొనుగోలు చేశాడు. ఈ మేరకు ఐదు సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకొని.. ఇప్పటివరకు కొనసాగిస్తున్నారు. అయితే డెక్కన్ చార్జెస్ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH) అనే నామకరణాన్ని కొత్త యాజమాన్యం పెట్టుకుంది. అలాగే డెక్కన్ చార్జర్స్ లో ఉన్న 12 మంది ప్లేయర్లను అలాగే కొనసాగించింది సన్రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత వేలంలో డేవిడ్ వార్నర్, కేన్ మామ, ప్రస్తుతం అభిషేక్ శర్మ, హెడ్, ఇలాంటి భయంకరమైన ప్లేయర్లను కొనుగోలు చేసి.. ఇప్పటికే ఓ టైటిల్ కూడా గెలుచుకుంది. మరోసారి ఫైనల్ దాకా వెళ్లి బోర్లా పడింది. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఇది సాధ్యమైంది.

Advertisement

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

 

 

Related News

ఐపీఎల్ ఫైన‌ల్స్ కు భారీ అడ్డంకి..80 శాతం వ‌ర్షం ప‌డే ఛాన్స్‌..రిజర్డ్ డే ఉంటుందా?

Shaheen Afridi: ప్ర‌తి బంతి 200 కిమీ స్పీడ్ తో వేస్తా..షాహీన్ అఫ్రిది సంచ‌ల‌నం

వైభ‌వ్ త‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టి..సానుభూతి పేరుతో మ‌ళ్లీ డ్రామాలు, సిరాజ్ పై ట్రోల్స్‌

గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్

Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌

గ్లోవ్స్ కు ఫెవీక్విక్ పెట్టుకో..సాయి సుదర్శన్ హిట్ వికెట్ పై సెహ్వాగ్ సీరియ‌స్‌

రెండోసారి సాయి సుద‌ర్శ‌న్ హిట్ వికెట్..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలిన గిల్

15 ఏళ్ల వైభ‌వ్ ను బెదిరించిన‌ రియాన్ ప‌రాగ్..ఎందుకురా నీకు ఇంత బిల్డ‌ప్ అంటూ!

Big Stories

Advertisement
×