E-Paper
Advertisement

న‌సీమ్ షాపై PKR 2 కోట్ల ఫైన్…పాకిస్తాన్ క్రికెట్ ను నాశ‌నం చేస్తోన్న‌ మరియం నవాజ్ ఎవ‌రు ?

న‌సీమ్ షాపై PKR 2 కోట్ల ఫైన్…పాకిస్తాన్ క్రికెట్ ను నాశ‌నం చేస్తోన్న‌ మరియం నవాజ్ ఎవ‌రు ?
Advertisement

Maryam Nawaz Sharif:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభ రోజున స్పెషల్ గెస్ట్ గా వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ పైన ( Maryam Nawaz Sharif ) పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ( Naseem Shah ) వివాదాస్పద పోస్ట్ పెట్టారు. అభిమానులు లేకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించి అడ్డమైన వాళ్లకు అతిథి మర్యాదలు చేస్తున్నారా ? అంటూ మరియం నవాజ్ ను ఉద్దేశించి నసీమ్ షా వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. అయితే మరియం నవాజ్ ను ఉద్దేశించి పోస్టు పెట్టినందుకు గాను నసీమ్ షా పైన వేటు (  Naseem Shah Fine) వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఏకంగా PKR 2 కోట్లు విధించింది. అంటే ఇండియ‌న్ రూపాయ‌ల‌లో 60 ల‌క్ష‌లు అన్న‌మాట‌. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

అసలు ఎందుకు మరియంపైన నసీమ్ షా పోస్టు పెట్టాడు ?

Advertisement

మరియం నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి నసీమ్ షా వివాదాస్పద పోస్ట్ పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. గతంలో గాయం కారణంగా నసీమ్ షా జ‌ట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో ఆపరేషన్ కోసం డబ్బులు కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును విజ్ఞప్తి చేశాడు నసీమ్ షా. లండన్ లో చికిత్స తీసుకుంటానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సమాచారం ఇచ్చాడు. దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక్క రూపాయి ఇవ్వ‌బోమ‌ని తెలిపింది. ఈ క్రమంలోనే తన సొంత డబ్బులతో పాకిస్తాన్ లోనే వైద్యం తీసుకున్నాడు నసీమ్ షా. అయితే అదే సమయంలో మరియం నవాజ్ షరీఫ్ కు అనారోగ్యం సోకితే.. లండన్ లో స్పెషల్ ట్రీట్మెంట్ అందించింది పాకిస్తాన్. అయితే ఒక రాజకీయ నాయకురాలికి ఉన్న రెస్పెక్ట్ క్రికెట్ ప్లేయర్ కు లేదని సీరియస్ నసీమ్ షా అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మరియం నవాజ్ షరీఫ్ ను గెస్ట్ గా పిలిచిన నేపథ్యంలో ఆమెకు అతిథి మర్యాదలు అవసరమా? ఆమె మ‌హారాణినా ? అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై మండిపడ్డారు. దీంతో నసీమ్ షాపైన చర్యలకు పూనుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

ఇంతకీ మరియం నవాజ్ షరీఫ్ ఎవరు ?

మరియం నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ లో ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2024 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురే ఈ మరియం నవాజ్ షరీఫ్. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానిగా పనిచేస్తున్న షహబాజ్ షరీఫ్ కూడా ఈ మరియం నవాజ్ కు చిన్నాన్న అవుతాడు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వ మొత్తం ఈమె చేతుల్లోనే ఉందన్నమాట. అలాంటి మరియం నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ఓపెనింగ్ సెర్మనీకి వస్తే మహారాణిలా ట్రీట్ చేయడం అవసరమా ? అంటూ నసీమ్ షా మండిపోయేలా పోస్ట్ పెట్టాడు. దీంతో అతనిపై ఈ వేటు వేశారు.

Advertisement

 

https://www.instagram.com/reels/DWW0GoWCKCE/

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×