// // India Vs West Indies : పూరన్ విధ్వంసం.. తిలక్ వర్మ మెరుపులు వృథా.. మళ్లీ విండీస్ విక్టరీ.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

India Vs West Indies : పూరన్ విధ్వంసం.. తిలక్ వర్మ మెరుపులు వృథా.. మళ్లీ విండీస్ విక్టరీ..

India Vs West Indies :  పూరన్ విధ్వంసం.. తిలక్ వర్మ  మెరుపులు వృథా.. మళ్లీ విండీస్ విక్టరీ..
Advertisement

India Vs West Indies : టీమిండియా తీరు మారలేదు. విజయానికి చేరువలోకి వచ్చి మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. వెస్టిండీస్ చేతిలో వరుసగా రెండో టీ20 మ్యాచ్ లోనూ ఓడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

తిలక్ వర్మ మరోసారి ఆకట్టుకున్నాడు. మ్యాచ్ లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. తిలక్ వర్మ (51, 41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ కిషన్ (27), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (24) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు రాణించలేదు. శుభ్ మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (1) , సంజు శాంసన్ (7) దారుణంగా విఫలమయ్యారు. దీంతో విండీస్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ఉంచింది. విండీస్ బౌలర్లలో అకిల్ హోసెన్ , అల్జారీ జోసెఫ్ , రోమారియో షెఫర్డ్ తలో రెండు వికెట్లు తీశారు.

Advertisement

153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత నికోలస్ పూరన్ దూకుడుగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. పూరన్ (67, 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) రెచ్చిపోవడంతో విండీస్ విజయం దిశగా వెళ్లింది. అయితే జట్టు స్కోర్ 126 పరుగుల వద్ద పూరన్ అవుట్ కావడంతో మ్యాచ్ టర్న్ తీసుకుంది. ఆ తర్వాత 16 ఓవర్ లో విండీస్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది.

విండీస్ విజయానికి 24 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కానీ చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక భారత్ విజయం లాంఛనమే అనిపించింది.అయితే అకిల్ హోసెన్, అల్జారీ జోసెఫ్ 9 వికెట్ కు 26 పరుగులు జోడించి భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది. భారత్ బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, ముఖేశ్ కుమార్ కు తలో వికెట్ తీశారు.

Advertisement

అద్భుతంగా ఆడి విండీస్ విజయానికి బాటలు వేసిన పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 5 మ్యాచ్ ల సిరీస్ లో విండీస్ 2-0 తేడాతో ముందంజలో ఉంది. మూడో టీ20 మ్యాచ్ మంగళవారం జరగనుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×