E-Paper
Advertisement

Pakistan PM Sharif On Ind vs Pak: మా కాళ్లు ప‌ట్టుకున్నా…టీమిండియాతో మ్యాచ్ ఆడ‌బోం, పాకిస్తాన్ ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న !

Pakistan PM Sharif On Ind vs Pak:  మా కాళ్లు ప‌ట్టుకున్నా…టీమిండియాతో మ్యాచ్ ఆడ‌బోం, పాకిస్తాన్ ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న !
Advertisement

Pakistan PM Sharif On Ind vs Pak: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించింది పాకిస్థాన్. ఈ మేరకు మూడు రోజుల కిందట ప్రకటన కూడా చేసింది. అయితే ఇదే అంశంపై పాకిస్తాన్ (Pakistan ) ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan Pm Shehbaz Sharif )మరోసారి స్పందించారు. ఇండియాతో మ్యాచ్ ఆడబోమని కుండ బద్దలు కొట్టారు. ఐసీసీ దిగివచ్చి తమ కాళ్లు మొక్కినా, మేము వినేది లేదు.. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా తో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం బంగ్లాదేశ్ కు సపోర్ట్ గా నిలుస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో మిగిలిన మ్యాచ్ లు ఆడతాం , కానీ ఇండియాతో ( India) మాత్రం అస్సలు ఆడేది లేదని స్పష్టం చేశారు షెహబాజ్ షరీఫ్.

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

టీమిండియాతో మ్యాచ్ ఆడ‌బోం, పాకిస్తాన్ ప్ర‌ధాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న !

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి అంటే ఈ నెల 15వ తేదీన లీగ్ దశలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించింది. హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. దీంతో ముస్తాఫిజుర్ రహమాన్ పై వేటు పడింది.

ఈ దెబ్బకు ఐపీఎల్ ప్రసారాలను కూడా బంగ్లాదేశ్ ఆపేసింది. అక్కడితో ఆగకుండా టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. పాకిస్తాన్ తరహా లోనే కొలంబో వేదికగా తమ మ్యాచ్ లు నిర్వహించాలని కోరింది బంగ్లాదేశ్. దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు. దీంతో టి20 ప్రపంచ కప్ ను బహిష్కరిస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో ఇండియాది తప్పు ఉందని ఎత్తి చూపిస్తూ… టీమిండియాతో జరిగే మ్యాచ్ కూడా పాకిస్తాన్ బహిష్కరించింది.

Advertisement

మూడు రోజుల కిందట ప్రకటన కూడా చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇండియా వల్ల బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందని.. వాళ్ళ తరఫున పాకిస్తాన్ నిలబడుతుందని వెల్లడించారు. బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిన నేపథ్యంలోనే దానికి నిరసనగా ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ప్రకటించారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ యాక్షన్ ?

పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తాజాగా చేసిన ప్రకటన నేపథ్యంలో ఐసిసి కూడా సీరియస్ గా వ్యవహరించే ఛాన్స్ ఉంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడకుండా పాకిస్తాన్ పై బ్యాన్ విధించే ఛాన్స్ ఉంది. అలాగే పాకిస్తాన్ వల్ల బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు వచ్చే నష్టాన్ని PCB నుంచి వసూలు చేసేలా కోర్టు మెట్లుఎక్క‌నుంది ఐసీసీ. అలాగే ఐసీసీ నుంచి వచ్చే డబ్బులను ఆపేయనున్నారు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో విదేశీ ప్లేయర్లు ఆడకుండా, వాళ్ల‌పై ఐసీసీ ఆంక్ష‌లు పెట్టే ప్రమాదం ఉంది.

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×