E-Paper
Advertisement

WBBL 2025: WBBLలో కొత్త‌ వివాదం…అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు.. అస‌లేం జ‌రిగిందంటే

WBBL 2025: WBBLలో కొత్త‌ వివాదం…అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు.. అస‌లేం జ‌రిగిందంటే
Advertisement

WBBL 2025: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Womens Big Bash League 2025) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. నవంబర్ 9వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 27 మ్యాచులు పూర్తయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ మెగా టోర్నమెంట్ లో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అంపైర్లు తీసుకున్న నిర్ణయం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది.. దీంతో రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ చోటు చేసుకుంది. ర‌ద్దు కావ‌డంతో ఇరు జ‌ట్ల మ‌ధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు.. తెరపైకి సరికొత్త వివాదం

Advertisement

ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Womens Big Bash League 2025 ) భాగంగా ఇవాళ 27వ మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ vs సిడ్నీ థండర్ ఉమెన్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందే వర్షం పడింది. అయితే కాసేపు వర్షం ఆగడంతో మ్యాచ్ ను పున: ప్రారంభించారు. అయితే ఓవర్లను కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. వర్షం పడడంతో ఒక్కో ఇన్నింగ్స్ ను 5 ఓవర్లకు పుదించారు ఫీల్డ్ ఎంపైర్లు. ఈ నేపథ్యంలో మొదట అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 5 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన అడిలైడ్ జట్టు ఏకంగా 45 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో సిడ్నీ థండర్ ఉమెన్ జట్టు దుమ్ములేపింది.

కేవలం 2.5 ఓవర్స్ లోనే వికెట్లు ఏమి నష్టపోకుండా 43 పరుగులు సాధించింది. మరో 13 బంతుల్లో కేవలం మూడు పరుగులు చేస్తే సిడ్నీ జట్టు విజయం సాధిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ vs సిడ్నీ థండర్ ఉమెన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ను వివాదాస్పదంగా రద్దు చేశారు అంపైర్లు. ఇలా మ్యాచ్ ను రద్దు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వర్షం ఎక్కువగా పడకపోయినా కూడా మ్యాచ్ ఆపేసినట్లు సిడ్ని జట్టు తరఫున ప్లేయర్లు అలాగే యాజమాన్యం సీరియస్ అయింది. మరో రెండు బంతులు ఆడిస్తే తమ జట్టు గెలిచేదని సిడ్ని వాదిస్తోంది. కానీ అంపైర్లు అడిలైడ్ కు సపోర్ట్ గా నిలిచారని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం వల్ల ఇలా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపివేశారని ఫైర్ అవుతున్నారు. మ్యాచ్ అలాగే కొనసాగితే తమ జట్టు విజయం సాధించేదని చెబుతున్నారు.

డక్వర్త్-లూయిస్ ప్రకారం సిడ్నీదే విజయం

Advertisement

13 బంతులు ఉండగానే మళ్ళీ వర్షం పడిందని అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ vs సిడ్నీ థండర్ ఉమెన్ మధ్య మ్యాచ్ ను అర్ధాంతరంగా రద్దు చేశారు అంపైర్లు. రూల్స్ ప్రకారం, ఇది చాలా తప్పిదమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. 13 బంతుల్లో మూడు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, సిడ్నీని విజేతగా డక్వర్త్ లూయిస్‌ పద్ధతి ప్రకారం ప్రకటించవచ్చు. కానీ అంపైర్లు అలా చేయకుండా మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేశారు. దీంతో సిడ్నీ జట్టుకు నష్టమే జరిగిందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. దీనిపై ప్రత్యేక విచారణ చేస్తే బాగుంటుందని కూడా సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×